Begin typing your search above and press return to search.

నారా రోహిత్ స‌ర‌స‌న షామిలి?

By:  Tupaki Desk   |   2 Oct 2015 4:50 AM GMT
నారా రోహిత్ స‌ర‌స‌న షామిలి?
X
నారా రోహిత్ ఇటీవ‌లి కాలంలో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు బ‌య‌టి బ్యాన‌ర్ల‌కు సినిమాలు చేస్తూనే సొంతంగా బ్యాన‌ర్ ప్రారంభించి సినిమాలు నిర్మిస్తున్నాడు. సొంత బ్యాన‌ర్‌ లో న‌వ‌త‌రం ట్యాలెంటుకు అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేస్తున్నాడు. హీరోగా త‌న‌ని తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటూనే, న‌వ‌త‌రం ట్యాలెంటుకు ఊతం ఇస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.

రోహిత్ ప్ర‌స్తుతం గుండెల్లో గోదారి ఫేం కుమార్ నాగేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. మ‌రో మూడు సినిమాలు రిలీజ్‌ల‌కు రావాల్సి ఉందింకా. సావిత్రి - పండ‌గ‌లా వ‌చ్చాడు - అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు ఆన్‌ సెట్స్ ఉన్నాయి. వీటితో పాటు మ‌రో చిత్రంలో న‌టించేందుకు గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సినిమాతో మ‌హేష్ సూర‌ప‌నేని అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడ‌ని స‌మాచారం. కార్తికేయ ఫేం బివి శ్రీ‌నివాస్ ఈ చిత్రానికి నిర్మాత‌. క‌థ‌లో రాజ‌కుమారి అనే టైటిల్‌ ని ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం.

ఈ చిత్రంలో రోహిత్ స‌ర‌స‌న ఓయ్ ఫేం షామిలి క‌థానాయిక‌గా న‌టిస్తోంది అని చెబుతున్నారు. షామిలీ ఇటీవ‌లే అజిత్ ప్రోత్సాహంతో తిరిగి ముఖానికి రంగేసుకుంటోంది. త‌మిళ్‌ లో కొన్ని సినిమాల్లో న‌టిస్తోంది. ఇప్పుడు నేరుగా తెలుగులో మ‌రోసారి అడుగు పెడుతోంది. రోహిత్ - షామిలి జంట తెర‌పై ఎలా క‌నిపిస్తుందో చూడాలి.