Begin typing your search above and press return to search.

హైదరాబాదీ షామిలి.. ఇక అగేది లేదు

By:  Tupaki Desk   |   20 March 2015 5:25 AM GMT
హైదరాబాదీ షామిలి.. ఇక అగేది లేదు
X
షామిలి.. ఈ పేరు అప్పట్లో ప్రముఖంగా వినిపించేది. బేబి షామిలి.. వేరే. ఈ షామిలి వేరే. ఈ అమ్మాయి పక్కా హైదరాబాదీ. తెలుగమ్మాయి. పైగా మోడలింగ్‌లో పాపులర్‌ నేమ్‌. ఇటీవలి కాలంలో హీరోయిన్‌ అయ్యింది. లవర్స్‌, చందమామ కథలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు తెలిసిపోయింది.

ప్రస్తుతం ఓ రెండు సినిమాల్లో నటిస్తోంది. కాయ్‌ రాజా కాయ్‌, క్లోజ్‌ ఫ్రెండ్స్‌ .. ఈ రెండు సినిమాలు రిలీజ్‌లకు రెడీగా ఉన్నాయి. అయితే ఇంతలోనే మరో ప్రాజెక్టుకు కమిటయ్యానని చెబుతోంది షామిలి. అసలు ఏం చేస్తోంది షామిలి మాటల్లోనే వింటే.. ''శ్రీరామ రక్ష అనేది నేను నటించిన తాజా సినిమా. రజిత్‌ మీనన్‌ హీరోగా నటించారు. ఇదో అందమైన రొమాంటిక్‌ డ్రామా. అందరికీ నచ్చే డ్రామా..'' అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాదు చాలా తక్కువ సమయంలో ఎక్కువ సినిమాల్లో నటించేస్తున్న ఈ భామ ఓ సంగతి గురించి గుచ్చి గుచ్చి చెప్పింది. అప్పుడే నాలుగైదు సినిమాల్లో నటించేశా. ఇన్నాళ్టికి అసలు సంగతి తెలిసింది. స్క్రిప్టు ప్రాధాన్యత ఎంతో తెలిసొచ్చింది. నేను స్క్రిప్టుతో ప్రేమలో పడుతున్నా.. అంటూ క్లూ ఇచ్చింది. అన్నట్టు షామిలీని ఓకే చేయించాలంటే స్క్రిప్టుతో పడేయాలంతే.