Begin typing your search above and press return to search.

ప్ర‌ముఖ గాయ‌ని కం న‌టి ఫిక‌రేంది ఈ ఏజ్ లో!

By:  Tupaki Desk   |   24 Sept 2020 12:40 PM IST
ప్ర‌ముఖ గాయ‌ని కం న‌టి ఫిక‌రేంది ఈ ఏజ్ లో!
X
షామ శికంద‌ర్ (41) మోడ‌లింగ్ నుంచి బుల్లితెర‌కు ప‌రిచ‌య‌మైన న‌టి కం గాయ‌ని. ఈ లేటు వ‌య‌సు బ్యూటీ హోస్ట్ గానూ రాణించింది. పెద్ద తెర‌పైనా ప‌లు చిత్రాల్లో అల‌రించింది. రెగ్యుల‌ర్ గా సోష‌‌ల్ మీడియాల్లో షామా స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. సినిమాల‌తో కంటే రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌తోనే అసాధార‌ణ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ బ్యూటీ.

బికినీల‌తో వేడెక్కించ‌డంలో షామా స్పెష‌లిస్ట్. ఇప్ప‌టికే ప‌లుమార్లు బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ లో 40 ప్ల‌స్ ఏజ్ బ్యూటీ చెల‌రేగిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. షామాలో హాట్ కంటెంట్ ఏమాత్రం త‌గ్గ‌డం లేద‌న‌డానికి తాజా ఫోటోషూట్ పెద్ద ఎగ్జాంపుల్. బోల్డ్ అండ్ బ్యూటీగా షామా మ‌రోసారి చెల‌రేగింది. వైట్ అండ్ వైట్ బికినీలో బీచ్ షేక‌య్యే రేంజులో విరుచుకుప‌డింది. ఈ బికినీని చూడ‌గానే ప‌ర్ఫెక్ట్ ఫిట్ బాడీ ఉన్న బ్యూటీగా గుండెల‌ద‌ర‌గొడుతోది. ఈ లుక్ చూడ‌గానే కిమ్ క‌ర్ధాషియ‌న్ కైనా చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందేనంటూ యూత్ కామెంట్లు చేస్తున్నారు.

ఇక కెరీర్ సంగ‌తి చూస్తే 2019లో బైపాస్ రోడ్ అనే చిత్రంలో న‌టించింది. అంతకుముందు సెక్సాలిక్ అనే షార్ట్ మూవీలో న‌టించింది. ప్ర‌స్తుతానికి బాలీవుడ్ లో ఆఫ‌ర్లేవీ లేక‌పోయినా మోడ‌లింగ్ వ్యాప‌కాల‌తో బిజీ. త‌దుప‌రి ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు భారీ చిత్రంలో ఓ ఆస‌క్తిక‌ర పాత్ర‌కు పేరును ప‌రిశీలిస్తున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.