Begin typing your search above and press return to search.

సారీలో షామా సెగ‌లు పుట్టిస్తుందే!

By:  Tupaki Desk   |   9 Sep 2022 1:30 AM GMT
సారీలో షామా సెగ‌లు పుట్టిస్తుందే!
X
బాలీవుడ్ బ్యూటీ శామా సికిందర్ టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇన్ స్టా వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు యువ‌త‌ని వెడెక్కిస్తుంది. గ్లామ‌ర్ ఎలివేష‌న్లో త‌న‌దైన మార్క్ త‌ప్ప‌నిస‌ర‌ని చెల‌రేగుతుంటుంది. డిజైన‌ర్ దుస్తుల్లో షామా అందాల‌కి య‌వ‌త‌ ఫిదా అవ్వాల్సిందే. తాజాగా సంప్ర‌దాయ చీర‌క‌ట్టులోనే అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంటుంది.

వైట్ క‌ల‌ర్ డిజైన‌ర్ సారీలో క్లీవేజ్ అందాల ఆర‌బోత‌లో జివ్వ‌నిపిస్తుంది. షోల్డ‌ర్ లెస్ ఎల‌స్టిక్ ర‌విక‌లో అగ్గిరాజేసే అందాల‌తో క‌వ్విస్తుంది. పెదాల‌కు ఎరుపు వ‌ర్ణం లిప్ స్టిక్..అదే పెదాల నుంచి అంద‌మైన న‌వ్వుని పుట్టించి యువ‌త‌లో గిలిగింత‌లు పెడుతుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

చూసి త‌నివి తీర‌డం అభిమానుల వంత్తైంది. లుక్స్ బ్యూటీపుల్..గార్జియ‌స్ అంటూ ఫ్యాన్స్ ఆస‌క్తిక‌ర‌ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఎలివేష‌న్ల‌లో షామా చాలా కాలం క్రిత‌మే పీహెచ్ డీ చేసేసింది. ఛాన్స్ దొరికినప్పుడ‌ల్లా ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో త‌న‌దైన శైలిలో చెల‌రేగుతుంటుంది. అందుకే షామా న‌టి క‌న్నా ఫ్యాష‌న్ బ్యూటీగా ఎక్కువ ఫేమ‌స్ అయింది.

అమ్మ‌డు చేసింది కొన్ని సినిమాలే అయినా ఇన్ స్టాలో ఫాలోవ‌ర్స్ నెంబ‌ర్ పీక్స్ లో ఉందంటే? కార‌ణం త‌న‌దైన గ్లామ‌ర్ అప్పిరియ‌న్స్ మాత్చ‌ర‌మే కార‌ణమ‌ని చెప్పాలి.

నటవృత్తి పరంగా శామ్ ఇంకా వెనుకబడే ఉంది. 'ప్రేమ్ అగాన్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'మన్' ..'ది డెడ్లీ పార్ట్'.. 'బస్తీ'..'దూమ్ ధడాకా'..'కాంట్రాక్ట్' ..'సెక్సాహోలిక్' లాంటి సినిమాల్లో నటించింది. బ్యూటీ చివరిసారిగా నటించిన 'బైపాస్ రోడ్' రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి కొత్త అవకాశాలేవి అందుకోలేదు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా గ్లామ‌ర్ అప్పీరియ‌న్స్ త‌ప్ప ఇంత వ‌ర‌కూ కొత్త ఛాన్స్ అందుకుంది లేదు. మ‌రి తాజా ప్ర‌య‌త్నాలేవైనా ఛాన్సులు తెచ్చి పెడ‌తాయా? అన్న‌ది చూడాలి. అమ్మ‌డి ప్ర‌య‌త్నంలో మాత్రం లోపం లేదు. శక్తి వంచ‌న లేకుండా శ్ర‌మిస్తుంది. కానీ వ‌రాలు ఇంకా ఆ గాడ్ ఇవ్వ‌లేదు. మ‌రి కెరీర్ ప‌రంగా షామా ఇంకెప్పుడు బిజీ అవుతుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.