Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: 'నెట్'లో షోకులు చూశారా?

By:  Tupaki Desk   |   6 April 2018 5:24 PM GMT
ఫోటో స్టోరి: నెట్లో షోకులు చూశారా?
X
ఆన్ స్క్రీన్ పై కనిపించేందుకు ఎన్ని రకాల దారులు ఉంటాయో.. అన్నిటిలోను మెరిసిపోయే అవకాశం అందరికీ దక్కదు. కానీ షామా సికందర్ మాత్రం ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివేసింది. ఈ 36 ఏళ్ల బ్యూటీ.. అడపా దడపా సినిమాలను చేస్తుంటుంది. వరుసగా టీవీ సిరీస్ లలో మెరిసపోతూ ఉంటుంది. డ్యాన్స్ షోలు.. రియాల్టీ షోలు ఈమెకు కొట్టిన పిండి. ఇక మాయ అనే వెబ్ సిరీస్ లోను.. మ్యూజిక్ వీడియోలలో కనిపించేసిన అనుభవం షామా సికందర్ కు ఉంది.

సీఐడీ అంటూ సుదీర్ఘంగా సాగుతున్న హిందీ సిరీస్ షామా సికందర్ యాక్ట్ చేసింది. అప్పుడప్పుడు ఫోటో షూట్స్ లో కూడా మెరిసిపోవడం ఈ భామకు భలే సరదా. రీసెంట్ గా ఇలాగే లింగరీలో ఓ షూట్ చేసింది ఈ బ్యూటీ. నెట్టెడ్ బ్లాక్ వేర్ లో ఈ సుందరి అందాలను చూడకపోతే.. గ్లామర్ ప్రియులు బోలెడంత కోల్పోయినట్లే. అంతగా తన షోకులను కెమేరా ముందు పరిచేసింది షామా సికందర్.

తన గ్లామర్ ను బోలెడంత ఎగ్జిబిట్ చేసేసిన షామా.. కళ్లతో చేస్తున్న మాయను వర్ణించడం మాటల తరం కాదు. అంతగా అందాల కనువిందు చేసేసి అబ్బురపరిచిన షామా సికందర్.. రెండేళ్ల క్రితం సెక్సాహాలిక్ అనే సినిమాలో నటించింది. అ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెరిసే అవకాశం మళ్లీ రాలేదు కానీ.. వస్తే మాత్రం ఏ స్థాయిలో అందాలను చూపించగలదో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అనచ్చేమో.