Begin typing your search above and press return to search.

బికినీలో బుల్లితెర తార

By:  Tupaki Desk   |   2 Jan 2018 10:02 AM GMT
బికినీలో బుల్లితెర తార
X
ఏం సినిమా వాళ్ళవేనా మావి కావా అందాలు అని చాటి చెప్పాలనుకుంది కాబోలు టీవీ స్టార్ శామా సికందర్ బాలీవుడ్ హీరొయిన్లకు ఏ మాత్రం తీసి పోనీ రీతిలో బికినీ ఫోజిచ్చి ఛాలెంజ్ విసిరింది. ఏ మేరి లైఫ్ హై లో పూజా పాత్ర ద్వారా బాగా పాపులర్ అయిన శామా సికందర్ సినిమా అవకాశాల కోసం పెద్ద గేలమే వేస్తోంది. వయసు పరంగా ముదురు భామ క్యాటగిరీలోకి వచ్చే శామా అదేమి పట్టించుకోకుండా ఇలాంటి స్టిల్స్ ఇవ్వడం చూసి అభిమానులు నోరెళ్ళబెడుతున్నారు. శామా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సినిమా ద్వారానే. ప్రేమ్ అగ్గన్ తో పరిచయమైన శామా అది అట్టర్ ఫ్లాప్ కావడంతో అడపాదడపా కొన్ని సినిమాలు చేసింది కాని ఏది వర్క్ అవుట్ కాక 2003లో సోనీ టీవీలో టెలికాస్ట్ అయిన ఏ మేరి లైఫ్ ద్వారా లైఫ్ అందుకుంది. డాన్స్ సిరీస్ - వెబ్ సిరీస్ - మ్యూజిక్ వీడియోస్ - రియాలిటీ షోస్ ద్వారా బాగా పాపులర్ అయిన శామాని ఇలా చూడటం వింతే.

సిడ్నీలో ని మ్యాన్లీ బీచ్ ఒడ్డున వైట్ అండ్ వైట్ టూ పీస్ బికినీలో శామా స్టిల్ చూస్తే నిజంగా తన వయసు 38 అంటే నమ్మడం కష్టం. పడుచు హీరొయిన్ల కుండే బాడీ ఫిట్ నెస్ తో కైపెక్కే ఓంపులతో ఫిదా చేసే మెలికలతో ఇలా ఫోజిస్తున్న శామా సికందర్ ని చూసి బాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం తన వైపు ఓ లుక్ వేసేలా చేసుకుంటోంది. బుల్లితెరపై చాలా పద్ధతి గల పాత్రలు పోషిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరైన శామాని ఇలా బికినీ అవతారంలో చూసిన వాళ్ళు మాత్రం వాటే టీవీ బ్యూటీ అనకుండా ఉండలేకపోతున్నారు .