Begin typing your search above and press return to search.

రెడ్ బికినీలో హాట్ యోగా: వైరల్ పిక్

By:  Tupaki Desk   |   1 Feb 2018 7:33 AM GMT
రెడ్ బికినీలో హాట్ యోగా: వైరల్ పిక్
X
శామా సికందర్. టీవీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన ఈ పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసిపోతోంది. కారణం తను ఇచ్చే హాట్ హాట్ స్టిల్స్ తో పాటు కుర్రకారుతో సహా అందరి మతులు, నిద్రలు చెడగొట్టేలా భంగిమలు ప్రదర్శించడం. పైన పిక్ చూస్తున్నారుగా. సిడ్నీ వెకేషన్ లో ఉన్నప్పుడు తనే స్వయంగా షేర్ చేసుకుంది శామా. బీచ్ ఒడ్డున యెర్రని రెండు పీలికల్లాంటి బికినీ వేసుకుని తను కళ్ళు మూసుకుని ఏదో యోగా చేస్తూ మనకు మాత్రం కనురెప్ప వేయనివ్వకుండా చేసిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు చాలా మంది స్మార్ట్ ఫోన్స్ లో షేర్ అవుతోంది. తన అందాలను బయటపెట్టడంలో ఏ మాత్రం మొహమాటపడే అలవాటు లేని శామా సికందర్ తన ఒంట్లో భాగాల గురించి వేరేవాళ్ళు కామెంట్ చేసే అవకాశం ఇవ్వకుండా తనే వర్ణించుకోవడం తన స్పెషాలిటీ.

మరి ఇంత హాట్ గా రెచ్చిపోయి ఫోజులిచ్చే శామాకు బాలీవుడ్ లో అవకాశాలు వెల్లువలా రావాలే అని మీకు అనిపించినా పాపం ఆ ఒక్క విషయంలో మాత్రం తనను బాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. 1998లోనే ప్రేమ్ అగ్గన్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన శామా అది అట్టర్ ఫ్లాప్ కావడంతో అట్టే అవకాశాలు దక్కించుకోలేకపోయింది. అమీర్ ఖాన్ మన్ లో సెకండ్ హీరొయిన్ గా నటించినా ఫలితం దక్కలేదు. 2003లో వచ్చిన టీవీ సీరియల్ ఏ మేరి లైఫ్ హై వచ్చాకే తనకు బ్రేక్ దొరికింది. తన 20 ఏళ్ళ కెరీర్ లో శామా సికందర్ చేసింది కేవలం 5 సినిమాలే అంటే ఆశ్చర్యం కలగక మానదు. 2003 నుంచి టీవీ కెరీర్ లో అప్రతిహతంగా సాగిన శామా ఇప్పుడు ఇలా సెమి న్యూడ్ ఫోటోస్ తో ఫాన్స్ కి విందు వడ్దించే పనిలో పడింది.

ఇంతా చేస్తోంది కదా శామా సికందర్ వయసు ఎంతో తెలుసా. 39. శరీరంలో అంత వయసు ఉంది అనిపించనివ్వకుండా శామా సికందర్ ఏం చేస్తోందో తెలియదు కాని పాపం ఈ హాట్ బ్యూటీని రైట్ టైంలో వాడుకుని ఉంటే సన్నీ లియోన్ ని తలదన్నేదేమో. డౌట్ ఉంటే తన సోషల్ మీడియా పిక్స్ చేస్తే అర్థమైపోతుంది.