Begin typing your search above and press return to search.

టాలీవుడ్ బ‌డా హీరోతో క‌మిట‌వ్వ‌మ‌ని వేధించాడు!

By:  Tupaki Desk   |   10 March 2021 7:30 AM GMT
టాలీవుడ్ బ‌డా హీరోతో క‌మిట‌వ్వ‌మ‌ని వేధించాడు!
X
చిన్న చేప‌తో ఆఫ‌ర్ కావాలంటే సొర చేపకు క‌మిట‌వ్వాలా? ఆ ద‌ర్శ‌కుడి ప్ర‌పోజ‌ల్ అలానే ఉంద‌ని ఆరోపించి వ‌ర్ధ‌మాన న‌టి సెన్సేష‌న్ కి తెర తీసారు. అది కూడా ఆఫ‌ర్ కావాలంటే టాలీవుడ్ కి చెందిన పెద్ద హీరోకి క‌మిట‌వ్వాల‌ని వేధించాడ‌న్న‌ది ఆమె ఆరోప‌ణ‌. ఫ‌లానా యువ‌హీరో స‌ర‌స‌న ఆఫ‌ర్ కావాలంటే ఆ పెద్ద హీరోతో క‌మిట్ మెంట్ ఇవ్వాల‌ని అడిగార‌ట‌.

ఇంత‌కీ ఎవ‌రీ న‌టీమ‌ణి? అంటే.. పేరు షాలు ష‌మ్ము. తెలుగువారికి అంత‌గా తెలీని పేరు ఇది. తాజాగా సోష‌ల్ మీడియా వేదికగా ఈ భామ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించింది. ఫ‌లానా స్టార్ హీరోకి క‌మిటైతే.. యువ‌హీరోతో ఆఫ‌ర్ అంటూ ఓ యంగ్ డైరెక్ట‌ర్ ఎర‌ వేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఎలా డీల్ చేయాలో తెలుసు కాబ‌ట్టి #మీటూ వేదిక‌ను కూడా ఆశ్ర‌యించ‌లేద‌ని స‌ద‌రు యువ‌క‌థానాయిక బ‌హిరంగంగానే తెలిపారు.

ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ వెంపర్లాడ‌ను. ముక్కుసూటిగా ఉంటాను. అందుకే నాకు అవ‌కాశాలు రావ‌డం లేద‌ని కూడా షాలూ వాపోయారు. #వియ్ నీడ్ ఛేంజ్..# స్టాప్ హ‌రాష్ మెంట్.. #వియ్ నెవ్వ‌ర్ కాంప్ర‌మైజ్ అనే హ్యాష్ ట్యాగ్ ల‌తో షాలు ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డంతో టాలీవుడ్ లో పెద్ద చ‌ర్చే మొద‌లైంది.

త‌మిళంలో ప‌లు డీగ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌తో మెప్పించిన షాలు ప్ర‌స్తుతం టాలీవుడ్ లోనూ అవ‌కాశాల వేట సాగిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే ఈ ప్ర‌పోజ‌ల్ తో యువ‌ద‌ర్శ‌కుడు త‌న‌ని సంప్ర‌దించార‌ట‌. ఇంత‌కీ ఈ ఎపిసోడ్ లో పెద్ద హీరో ఎవ‌రు? యువ హీరో ఎవ‌రు? ప‌్ర‌పోజ‌ల్ పెట్టిన యంగ్ డైరెక్ట‌ర్ ఎవ‌రు? అన్న చ‌ర్చా సాగిపోతోంది.