Begin typing your search above and press return to search.

సడెన్‌ గా పెళ్లి ఫొటోలు షేర్‌ చేసి షాక్‌ ఇచ్చిన హీరోయిన్‌

By:  Tupaki Desk   |   22 Aug 2020 8:00 PM IST
సడెన్‌ గా పెళ్లి ఫొటోలు షేర్‌ చేసి షాక్‌ ఇచ్చిన హీరోయిన్‌
X
ఇటీవల కాలంలో ఓటీటీలో వచ్చి ప్రేక్షకులను అలరించిన చిన్న చిత్రాలు కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా మరియు భానుమతి రామకృష్ణల్లో కీలక పాత్రల్లో నటించిన శాలిని వడ్నికట్టి అనూహ్యంగా తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో పెళ్లి ఫొటోలు షేర్‌ చేసి అందరికి షాక్‌ ఇచ్చింది. నటిగా ఇప్పుడిప్పుడే మంచి పేరు దక్కించుకుంటున్న ఈమె హీరోయిన్‌ గా కూడా నటిస్తుంది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకుంటుందని ఎవరు ఊహించలేదు. కరోనా కారణంగా పెద్దగా బంధువులు హడావుడి లేకుండా శాలిని పెళ్లి చేసుకుంది.

ఈమె తన భర్త మనోజ్‌ బీదను పరిచయం చేసింది. ఈయన తమిళ దర్శకుడు. ఇప్పటికే ఈయన ఒక సినిమాను తెరకెక్కించినా అది కమర్షియల్‌ గా ఫ్లాప్‌ అయ్యింది. ప్రస్తుతం తదుపరి చిత్రం విషయంలో చర్చలు జరుపుతున్నాడు. వీరిద్దరిది ప్రేమ వివాహం అయ్యి ఉంటుందా లేదంటే పెద్దలు కుదిర్చిన వివాహం అయ్యి ఉంటుందా అనే విషయంలో సస్పెన్స్‌ గా ఉంది. పెళ్లి గురించి ఎలాంటి విషయాలను వివరాలను తెలియజేయకుండా సింపుల్‌ గా ఈమె పెళ్లి ఫొటోలు అంటూ ఇన్‌ స్టాలో షేర్‌ చేసింది. తర్వాత అయినా ఈమె తన పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తుందో లేదో చూడాలి.