Begin typing your search above and press return to search.

మహానటిలో అర్జున్ రెడ్డి హీరోయిన్

By:  Tupaki Desk   |   11 Sep 2017 7:30 AM GMT
మహానటిలో అర్జున్ రెడ్డి హీరోయిన్
X
అందం అభినయం కలిగిన అలనాటి అందాల తార సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. చూడగానే అక్కట్టుకునేల ఉండే ఆమె అందంతో సౌత్ లో మహనటిగా ఎనలేని ఆదరణను దక్కించుకున్నారు. నటనలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన ఆమె జీవితం కూడా ఎన్నో వైవిధ్యమైన మలుపులు తిరిగింది. సంతోషంగా జీవితం సాగుతోంది అని అనుకునే లోపే ఊహించని పరిణామాలు ఆమె జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చి చివరికిి చివరి శ్వాసను విడిచేలా చేశాయి.

అయితే ఆ పరిణామాల వెనుక ఎన్నో సందేహాలకు జవాబును ఇవ్వడానికి ఎవడే సుబ్రహ్మణ్యం తీసిన నాగ్ అశ్విన్ తన రెండవ సినిమానే మహానటి సావిత్రి బయోపిక్ ని ఎంచుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన నటినటులందరిని సెలెక్ట్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు మరొక ముఖ్య పాత్ర కోసం అర్జున్ రెడ్డి హీరోయిన్ ను సెలెక్ట్ చేసినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ - జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ తో పాటు నటి సమంత కూడా మరొక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే కూడా మహానటి సినిమాలో భాగం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి అనే పాత్రను ఎంతో చక్కగా చేసిన షాలిని ని చూడగానే మహానటి దర్శకుడి నాగ్ అశ్విన్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకు షాలిని అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందని ఆమెను ఫైనల్ చేసేశాడట. ఇక ఈ సినిమాను ఎలాగైనా అనుకున్న టైమ్ కి పూర్తి చేసి 2018 లో రిలీజ్ చేయడానిక్ నిర్మాత సి. అశ్వినిదత్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.