Begin typing your search above and press return to search.

శాకుంతలం రెడీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!

By:  Tupaki Desk   |   2 Jan 2023 6:30 AM GMT
శాకుంతలం రెడీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
X
చూడాలని ఉంది, ఒక్కడు, రుద్రమదేవి వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ మళ్ళీ ఫామ్ లోకి రావాలని అనుకుంటుంన్నాడు. సమంతతో తెరపైకి తీసుకువచ్చిన శాకుంతలం సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాను గత ఏడాదిలో విడుదల చేస్తారు అనుకుంటే వివిధ కారణాల వలన వాయిదా వేస్తూ మొత్తానికి ఇప్పుడు ఫిబ్రవరి నెలలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

పెద్దగా సినిమాల హడావిడి లేని సమయంలోనే విడుదల చేస్తే బెటర్ అని ప్రెజెంటర్ గా ఉన్న దిల్ రాజు ఇచ్చిన సలహాతో గుణశేఖర్ నెమ్మదిగా సినిమా పనులను పూర్తి చేసుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం సినిమా పనులు అయితే తుది దశలో ఉన్నాయి. మరి కొన్ని రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇక ప్రమోషన్స్ డోస్ కూడా పెంచాలి అని గుణశేఖర్ ప్రణాళికలు రచిస్తున్నాడు.

ఇక మొత్తానికి విడుదల తేదిపై చిత్రం యూనిట్ క్లారిటీ ఇచ్చింది. శాకుంతలం సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన హిందీ తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది.

ఇక ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ లో నటించగా మరొక ముఖ్యమైన పాత్రలో సమంతకు జోడిగా మలయాళం నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు.

అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా ఈ సినిమాలో చిన్నప్పటి సమంత పాత్రలో నటించింది. మొత్తానికి అయితే సినిమాను విడుదల చేసేందుకు గుణశేఖర్ టీమ్ సిద్ధమైంది. ఆయన సొంత ప్రొడక్షన్ లోనే ఈ సినిమాను నిర్మించారు.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా ఉన్నాడు. ఇక ఎంతో కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న దర్శకుడు గుణశేఖర్ శాకంతలం సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.