Begin typing your search above and press return to search.

బాహుబ‌లిలా బాలీవుడ్ న‌టుడు శ‌క్తిక‌పూర్: మందు కోసం పెద్ద డ్ర‌మ్మే ఎత్తాడు

By:  Tupaki Desk   |   10 Jun 2020 4:07 PM GMT
బాహుబ‌లిలా బాలీవుడ్ న‌టుడు శ‌క్తిక‌పూర్: మందు కోసం పెద్ద డ్ర‌మ్మే ఎత్తాడు
X
ప్ర‌స్తుతం లాక్‌డౌన్ ఉండ‌డం.. సినిమా షూటింగ్స్ ప్రారంభం కాక‌పోవ‌డంతో సినీ న‌టీన‌టులు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా యూట్యూబ్‌, టిక్‌టాక్ త‌దిత‌ర యాప్స్‌ల‌లో ప్రేక్ష‌కుల‌ను అందుబాటులో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ న‌టుడు బాహుబ‌లి అవ‌తారం ఎత్తాడు. మ‌ద్యం కోసం ఏకంగా డ్ర‌మ్‌నే చేత్తో ఎత్తి తీసుకెళ్లాడు. ఫ‌న్నీగా రూపొందించిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

లాక్‌డౌన్‌తో ఏర్ప‌డిన వైర‌స్ భ‌యాన్ని తొల‌గించి ప్ర‌జ‌ల‌ను న‌వ్వించేందుకు శ‌క్తి క‌పూర్ ఈ ప్ర‌య‌త్నం చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో దానికి సంబంధించిన వీడియోను పోస్టు చేశాడు. అత‌డు ఓ డ్ర‌మ్ము సైజులో ఉన్న చెత్త బుట్ట‌ను త‌ల‌పై ఎత్తుకుని బాహుబ‌లిలా ప్ర‌భాస్‌లా ఒక్కో అడుగు ముందుకేస్తూ గేటు వైపు న‌డిచాడు. ఈ స‌మ‌యం‌లో ఓ వ్య‌క్తి 'హ‌లో భాయ్‌.. ఎక్క‌డికి వెళుతున్నారు?' అని అడ‌గ్గా.. శ‌క్తి కపూర్ 'మందు కోసం' అని సమాధానమిచ్చాడు. ఇది విన్న అత‌డు అపార్ట్‌మెంట్ వాసుల కోసం కూడా మందు తీస్కురా అంటూ జోకు వేశాడు. దీంతో ఇద్ద‌రు న‌వ్వారు.

ఫ‌న్నీగా రూపొందించిన ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. శ‌క్తి క‌పూర్ ఎవ‌రో కాదు శ్ర‌ద్ధాక‌పూర్ తండ్రి. ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు బాలీవుడ్‌లో 700 సినిమాల్లో న‌టించాడు. బిగ్‌బాస్ 5వ సీజ‌న్‌లో పాల్గొన్నాడు.