Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్‌: నీలోని శ‌క్తితోనే సూప‌ర్ హీరో కాగ‌ల‌వు

By:  Tupaki Desk   |   9 March 2020 4:30 PM IST
ట్రైల‌ర్ టాక్‌:  నీలోని శ‌క్తితోనే సూప‌ర్ హీరో కాగ‌ల‌వు
X
సైలెంటు గా హిట్లు కొట్టి స‌త్తా చాటడం శివ‌కార్తికేయ‌న్ స్టైల్. కోలీవుడ్ లో తెలివైన హీరోగా అత‌డికి గుర్తింపు ఉంది. అంత‌మంది స్టార్ హీరోల్లో శివ కార్తికేయ‌న్ త‌న‌ని తాను నిల‌బెట్టుకుంటున్న తీరుకు ప్ర‌త్యేకించి ఫ్యాన్స్ న్నారు. శివ కార్తికేయన్- కల్యాణి ప్రియదర్శన్ జంటగా పీఎస్ మిత్రన్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ `హీరో` తెలుగులో `శక్తి` (ది సూప‌ర్ హీరో) పేరుతో అనువాద‌మై విడుదలవుతోంది. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్.. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్.. ఇవానా కీల‌క పాత్రల్లో నటించారు. కేజేఆర్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

తాజాగా శక్తి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. విజువ‌ల్స్ ఆద్యంతం ఎంతో స్ఫూర్తివంత‌మైన థీమ్ తో ఆక‌ట్టుకుంది. సూపర్ హీరో కావాలని కలలు కనే శక్తిగా శివ కార్తికేయన్ ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడు. ప్ర‌త్యేకించి సూప‌ర్ హీరో మాస్క్ తో శివ కార్తికేయ‌న్ పాత్ర చిత్ర‌ణ ఆస‌క్తిని రేకెత్తించింది. అర్జున్.. అభయ్ డియోల్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించారు. విద్యతో వ్యాపారం- నకిలీ సర్టిఫికెట్ల దందాపై సినిమా ఇద‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం ఉంది.

ఇక అభిమ‌న్యుడు (ఇరుంబు తిరై - విశాల్) లాంటి బ్లాక్ బస్ట‌ర్ ని తెర‌కెక్కించిన పి.ఎస్.మిత్ర‌న్ మైండ్ గేమ్ నేప‌థ్యంలో మ‌రో ఆస‌క్తిక‌ర చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని అర్థమవుతోంది. ట్రైల‌ర్ ఆద్యంతం బీజీఎం తో పాటు.. రీరికార్డింగ్ మెప్పించింది. మార్చి 20న శ‌క్తి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం : యువన్ శంకర్ రాజా- కెమెరా : జార్జ్ సి. విలియమ్స్.