Begin typing your search above and press return to search.

1000 వాట్ సిల్వ‌ర్ గోల్డ్ బికినీ బ‌ల్బ్స్

By:  Tupaki Desk   |   4 Feb 2020 7:01 AM GMT
1000 వాట్ సిల్వ‌ర్ గోల్డ్ బికినీ బ‌ల్బ్స్
X
అందం ఎన‌ర్జీ ఓ చోట చేరితే జెన్నిఫ‌ర్ అనాలేమో! అందుకు ప‌దింత‌లు శ‌క్తిని కూర్చి ఉర‌క‌లెత్తిస్తే ష‌కీరా అని ఐడెంటిఫై చేయాలి. ఆ ఇద్ద‌రూ క‌లిస్తే ఇంకేమైనా ఉందా? వేదిక‌ను చీల్చుతూ ఎర్త్ కేక్ రావ‌డం గ్యారెంటీ. ఇదిగో ఈ వేదిక‌పై అలాంటి స‌న్నివేశ‌మే ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈసారి ది గ్రేట్ ``ఐకానిక్ సూప‌ర్ బౌల్ హాఫ్ టైం 2020 షో``లో పాప్ స్టార్స్ జెన్నిఫ‌ర్ లోపేజ్.. ష‌కీరా చెల‌రేగిపోయిన తీరుకు యూత్ ఔరౌరా! అంటూ ముక్కున వేలేసుకున్నారు.

ర‌క‌ర‌కాల డిజైన‌ర్ లుక్స్ తో జెలో- ష‌కీరా క‌వ్వింత ఈ వేదిక‌ పై మ‌తి చెడ‌గొట్టింది. ఈ జోడీ మెగా రీమిక్సెస్ స్టేడియంను తుఫాను హోరుతో త‌డిపి ముద్ద చేసాయి. ఆర‌డుగుల బుల్లెట్టు లా ఉన్న ఆ కటౌట్ల నుంచి జ‌నం క‌ళ్లు తిప్పుకోలేదంటే అతిశ‌యోక్తి కాదు. ఇక జెలో న‌గ్న బాడీసూట్ లుక్ చూస్తే.. మ‌తి చెడాలంతే. ఏదో అంగాంగం క‌వ‌ర్ చేయాలిలే! అన్న‌ట్టుగా పాక్షికంగా అందాల ఎర వేసిన తీరు ఆ ఇంప్రెస్సివ్ డిజైన్ ని మెచ్చుకుని తీరాలి. ర‌క‌ర‌కాల అద్దాల‌తో వెండి రంగుతో మిల‌మిలా మెరిపించే ఆ డిజైన‌ర్ వేర్ ని డిజైన్ చేసిన తీరు న‌భూతోన‌భవిష్య‌తి. ఒక‌ర‌కంగా నాటి హస్టలర్స్ రోజులకు తీసుకువెళ్లింది. జెలో వెండి త‌ళుకులు.. ష‌కీరా గోల్డ్ షిమ్మ‌రీ డిజైన్ కాంబినేష‌న్ కెవ్వు కేక అనే చెప్పాలి.

సూపర్ వుమన్ స్పీడ్ ఉన్న ష‌కీరా వేదికపైకి దూసుకొచ్చిన తీరు సీనియ‌ర్ అయిన‌ జెలోకి ఏమాత్రం త‌క్కువ కాదు. ఐకానిక్ సూపర్ బౌల్ హాఫ్ టైం షోలో డ్యాన్స్ ల‌తో ష‌కీరా అగ్గి రాజేసింది. మోకాలి వ‌ర‌కూ ఎత్తైన బూట్ల తో ష‌కీరా నృత్యం చేసిన తీరు ఇంట్రెస్టింగ్. ఇక ఆ ఇద్ద‌రు అంద‌గ‌త్తెల డ్యాన్సింగ్ ట్రీట్ కి క‌ళ్లు అంకితమివ్వాల్సిందే.