Begin typing your search above and press return to search.

సంపూ సినిమాలో షకీలా కూడా...

By:  Tupaki Desk   |   29 March 2016 8:26 AM GMT
సంపూ సినిమాలో షకీలా కూడా...
X
మల్లూ ఆంటీగా ఆన్ లైన్ మీడియాలో షకీలా చాలా ఫేమస్. మలయాళ ఇండస్ట్రీలో అన్నీ ఆ టైపు పాత్రలే చేసినా.. టాలీవుడ్ లో మాత్రం షకీలా భిన్నమైన పాత్రలతో అలరించింది. ఇక్కడ ఆమె పర్సనాలిటీని కామెడీకి ఉపయోగించుకుంటూ దర్శకులు పాత్రలు సృష్టించారు. సహజంగానే మంచి నటి అయిన షకీలా.. మంచి టైమింగ్ తో కామెడీ పండించి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఓ సినిమాని నిర్మించి దెబ్బ తిన్న తర్వాత షకీలా మళ్లీ సినిమాల్లో కనిపించడం మానేసింది.

ఇప్పుడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మూవీ కొబ్బరి మట్టలో షకీలా నటిస్తుండడం విశేషం. ఈ సినిమాలో రోల్ చేయాలంటూ.. దర్శకుడు సాయి రాజేష్ షకీలాను సంప్రదించినపుడు.. కనీసం అతను చెప్పింది వినేందుకు కూడా ఇష్టం చూపలేదట అమ్మడు. కానీ చివరకు మొత్తం స్టోరీ అంతా విన్నాక తను చేయాల్సిన రోల్ గురించి తెలిసి ఆశ్చర్యపోయిందట షకీలా. కొబ్బరి మట్టలో నటించేందుకు అలా ఒప్పించాడట సాయి రాజేష్.

ఇంతకీ ఈ మూవీలో షకీలా కేరక్టర్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది కామెడీ రోల్ కాదు. రొమాంటిక్ సీన్స్ చేసే పాత్ర అంత కన్నా కాదు.. ఫుల్ ప్లెడ్జెడ్ గా సెంటిమెంట్ పండించే పాత్ర అంటున్నారు. అయితే... ఈ మూవీలో హీరో సంపూర్ణేష్ అని తెలిసి విపరీతంగా ఆశ్చర్యపోయిందట మన మల్లూ ఆంటీ. సంపూని చూసి మొదట నిర్మాతగా అనుకున్నా.. తర్వాత హీరో అని యూనిట్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయని తెలిసింది.