Begin typing your search above and press return to search.

'యూ' సర్టిఫికెట్ పొందిన శృంగారతార సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..?

By:  Tupaki Desk   |   10 Jun 2020 9:30 AM GMT
యూ సర్టిఫికెట్ పొందిన శృంగారతార సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..?
X
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో షకీలా అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాలన్నీ ఏ సర్టిఫికెట్ సినిమాలే. హీరోయిన్ గా ఆపేసిన తర్వాత కాస్త డీసెంట్ పాత్రలు చేస్తూ వస్తుంది షకీలా. అప్పట్లో శృంగార తారగా వెలిగిన ఆమె ప్రస్తుతం ఆ ముద్రను చెరిపేసే పనిలో ఉన్నట్లుంది. గతంలో ఇక షకీలా సినిమా వస్తుందంటే.. ఏ గ్రేడ్ థియేటర్స్ ముందు షకీలా అభిమానుల జాతర కనిపించేది. కానీ ఇదంతా ఒక్కప్పటి మాట. ఇప్పుడు ఈ శృంగార తార వయసు మీదపడటంతో కేవలం క్యారెక్టర్ పాత్రలు మాత్రమే చేస్తూ నెట్టుకొస్తుంది. ఇక షకీలా నటించిన సినిమాలకు సెన్సార్ బోర్డు వారు కళ్లు మూసుకుని ఏ సర్టిఫికెట్ జారీ చేసేవారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలన్నీ అవాక్కయ్యేలా.. తాజాగా షకీలా నటించిన సినిమాకి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చిందట సెన్సార్ బోర్డు.

‘షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోందట. ఈ సినిమాలో ఎక్కడా కట్ చేయకుండానే సెన్సార్ బోర్డు వారు యూ సర్టిఫికెట్ జారీ చేయడంతో షకీలా కెరీర్‌లోనే ఫస్ట్ యూ సర్టిఫికెట్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. రెండు గంటల నిడివి ఉన్న ఈ చిత్రంలో 9 పాటలు ఉన్నాయని దర్శకుడు సాయిరాం దాసరి తెలిపాడు. మరి పెద్ద సినిమాలకే థియేటర్లు దిక్కులేవు.. ఈ సంగతేంటో తెలియాల్సి ఉంది. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలా? లేక ఓటీటీలో విడుదల చేయాలా? అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని డైరెక్టర్ సాయిరాం తెలిపాడు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని చిత్రయూనిట్ సెలవిచ్చారు.