Begin typing your search above and press return to search.

శృంగార తార 'షకీలా' బయోపిక్ తెలుగు ట్రైలర్..!

By:  Tupaki Desk   |   26 Dec 2020 2:05 PM IST
శృంగార తార షకీలా బయోపిక్ తెలుగు ట్రైలర్..!
X
సౌత్ సినీ ఇండస్ట్రీలో శృంగార తారగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షకీలా.. 90స్ లలో తన చిత్రాలతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. తెలుగు తమిళ కన్నడ మలయాళం భాషలో అడల్ట్ చిత్రాలలో నటించిన షకీలా స్టార్ హీరోలకు పోటీగా నిలిచింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న షకీలా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ ''షకీలా'' ఈ బయోపిక్ లో బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా టైటిల్ పోషించగా.. పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో నటించాడు. ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహించిన 'షకీలా' ప్రచార చిత్రాలతోనే సినిమాపై ఆసక్తిని కలిగించింది. క్రిస్మస్ సందర్భంగా నిన్న హిందీలో విడుదలైన 'షకీలా' చిత్రాన్ని డబ్బింగ్ చేసి జనవరి 1వ తేదీన తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'షకీలా' తెలుగు ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది.

'షకీలా' ట్రైలర్ చూస్తుంటే షకీలా పాత్రలో రిచా చద్దా అద్భుతంగా నటించడమే కాకుండా ఓ రేంజ్ లో అందాలు ఆరబోసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద షకీలా సినిమాలలోకి ఎలా వచ్చింది.. తన బోల్డ్ సినిమాలతో ఎలాంటి అనుభవాను ఎదుర్కొంది.. జూనియర్ సిల్క్ గా పేరు తెచ్చుకున్న షకీలా ఎలా తిరస్కరణకు గురైంది.. ఆమె సక్సెస్ మరియు ఫెయిల్యూర్స్.. నమ్మినవారి చేతిలో ఆమె ఎలా మోసపోయింది అనే అంశాలు ఇందులో ప్రస్తావించినట్లు అర్థం అవుతోంది. పంకజ్ త్రిపాఠి అలనాటి సౌత్ స్టార్ హీరో పాత్రలో అద్భుతంగా నటించారని తెలుస్తోంది. ఇప్పటికే హిందీలో విడుదలైన 'షకీలా' సినిమా కోసం తెలుగు తమిళ కన్నడ మలయాళ ప్రేక్షులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.