Begin typing your search above and press return to search.

అలాంటి షకీలా.. ఇప్పుడిలా!!

By:  Tupaki Desk   |   29 Oct 2016 3:58 AM GMT
అలాంటి షకీలా.. ఇప్పుడిలా!!
X
షకీలా.. ఈ పేరే ఓ పెద్ద బ్రాండ్. మలయాళ సినీ పరిశ్రమను ఓ సమయంలో భయపెట్టేసిన హిస్టరీ ఆమెది. షకీలా సినిమాల స్పీడుతో పోటీ పడలేక.. స్టార్ హీరోలందరూ కలిసి ఆమె మూవీస్ ని బ్యాన్ చేసే సిట్యుయేషన్ పట్టుకొచ్చేసిన ఘనత తన సొంతం. ఆ తర్వాత టాలీవుడ్ లో కమెడియన్ అవతారం ఎత్తి చాలా సినిమాల్లో నటించినా.. ఆ టైపు సాఫ్ట్ టచ్ మాత్రం ఉండేది.

ఇప్పుడు సంపూర్ణేష్ బాబు నటిస్తున్న కొబ్బరి మట్టలో ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనుంది షకీలా. ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుండగా.. షకీలా ఇలా డిఫరెంట్ గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏజ్డ్ గెటప్ తో షకీలా నటిస్తుండగా.. ఈ కేరక్టర్ సినిమాకి కీలకంగా ఉంటుందని.. ఈమె తన యాక్టింగ్ ట్యాలెంట్ తో మరో యాంగిల్ లో అందరినీ మెస్మరైజ్ చేస్తుందని తెలుస్తోంది. ఈ హోమ్లీ కేరక్టర్ గానీ క్లిక్ అయితే.. టాలీవుడ్ లో షకీలాకి ఇలాంటి రోల్స్ బోలెడన్ని రావడం ఖాయం అంటున్నారు సినీ జనాలు.

కొబ్బరి మట్టలో సంపూ మూడు పాత్రల్లో నటిస్తుండగా.. ఏడుగురు హీరోయిన్లు ఇతడితో ఆడిపాడుతుండడం చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ కూడా పూర్తయిపోగా.. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/