Begin typing your search above and press return to search.

అమ్మనే మొదట ఒక వ్యక్తి వద్దకు పంపింది

By:  Tupaki Desk   |   30 July 2019 1:30 AM GMT
అమ్మనే మొదట ఒక వ్యక్తి వద్దకు పంపింది
X
సౌత్‌ ఇండియన్‌ సినీ ప్రేక్షకులకు షకీలాను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈమె 1990 తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. స్టార్‌ హీరోలకు సైతం ముచ్చెమటలు పట్టించిన ఈమె జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఇప్పటి వరకు ఎన్నో ఇంటర్వ్యూలో ఈమె తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. తాజాగా ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ కు ఈమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన జీవితంలోని మరిన్ని సంచలన విషయాలను చెప్పుకొచ్చింది.

నా జీవితంలో ఎంతో మంది చేతిలో మోసపోయాను. అక్క అని నమ్మినందుకు నన్ను మోసం చేసింది. అప్పటి నుండి కూడా ఆమెతో కాంటాక్ట్‌ లేదు. ఆమె చేసింది తప్పని ఎప్పుడో ఒక సందర్బంలో తెలుసుకుంటుంది. మా అక్క మాత్రమే కాకుండా మా అమ్మ కూడా నన్ను ఎప్పుడు కూతురు మాదిరిగా చూడలేదు. నేను సంపాదించిన సమయంలో కూడా ఆమె నన్ను ఒక కూతురు మాదిరిగా చూడలేదు.

నన్ను ఫస్ట్‌ టైం ఒక హోటల్‌ వద్దకు తీసుకు వెళ్లిన అమ్మ అక్కడ రూంలో ఒక వ్యక్తి వద్దకు పంపించింది. ఆ వ్యక్తిని బతిమిలాడితే ఏం చేయకుండా వదిలేశాడు. నేను ఏ వయసులో వర్జినిటీ కోల్పోయానో నాకు గుర్తు లేదు. అది ఎప్పుడు ఉండాలనుకున్నానో అప్పుడు లేకుండా పోయింది. నేను చాలా మందినే ప్రేమించాను. చివరిగా నితీష్‌ కుమార్‌ తో 10 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నాను. నేను ప్రేమించిన వ్యక్తులతో సర్దుకు పోయి ఉంటే నా జీవితంలో ఎప్పుడో పెళ్లి అయ్యేది. కాని నాది సర్దుకు పోయే మనస్థత్వం కాదు. అందుకే అన్ని ప్రేమలు విఫలం అయ్యాయి. నేను ఎంతో వైభవంగా జీవితాన్ని గడిపానని అంతా అనుకుంటారు. కాని ఎప్పుడు కూడా నేను లగ్జరీ లైఫ్‌ ను ఎంజాయ్‌ చేయలేదు. నా అవసరాలకు తగ్గట్లుగా తినడం.. తాగడం జరిగింది కాని ఎక్కువగా అయితే లేదు.

ఇక నాకు మందు అలవాటు ఉంది. అయితే ఆడవారితో ఎక్కువగా కలిసి తాగేందుకు ఇష్టపడతాడు. ఎందుకంటే మందు తాగిన తర్వాత మగవారు చివరకు ఏం కోరుకుంటారో తెలిసిందే. అందుకే అమ్మాయిలతో మందు షేర్‌ చేసుకునేందుకు తాను ఇష్టపడతాను. ఇక షూటింగ్‌ ముగిసిన తర్వాత అలసిపోయినా పడుకునేదాన్ని కాదు. ఒకవేళ పడుకుంటే డ్రస్‌ ఎత్తేందుకు చాలా మంది ఎదురు చూసేవారు. అందుకే సెట్‌ లో నిద్ర పోయేదాన్ని కాదు.

రోజుకు 3 లక్షల రూపాయల పారితోషికం ఇచ్చే సమయంలో ఒక రాత్రికి 15 లక్షల రూపాయలు ఇస్తామంటూ వచ్చేవారు. 23 ఏళ్ల వయసులో ఉన్న సమయంలోనే సినిమాల్లో అన్ని చూపించేశాను. ఇప్పుడు నా వయసు 42 ఏళ్లు. ఇప్పుడు చూపించేందుకు ఏమీ లేదు. తాజాగా 'కొబ్బరిమట్ట' చిత్రంలో నటించిన ఈమె సంపూకు తల్లిగా కనిపించబోతుంది.