Begin typing your search above and press return to search.
వర్మ చూపిన దారిలో షకీలా వివాదాస్పద చిత్రం
By: Tupaki Desk | 17 July 2020 1:42 PM ISTవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వరుసగా చిత్రాలను తెరకెక్కిస్తు ఏటీటీ(ఎనీ టైం థియేటర్) ద్వారా డిజిటల్ ఫార్మట్ లో విడుదల చేస్తున్న విషయం తెల్సిందే. వర్మ చూపించిన దారిలో చాలా మంది నిర్మాతలు ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలను డిజిటల్ ఫార్మట్ లో టికెట్లు పెట్టి విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. షకీలా తన వివాదాస్పద చిత్రం ‘లేడీస్ నాట్ అలౌడ్’ ను డిజిటల్ ఫార్మట్ లో రూ. 50 ల టికెట్టు పెట్టి విడుదల చేసేందుకు రెడీ అయ్యింది.
రెండు సంవత్సరాల క్రితం పూర్తి అయిన ‘లేడీస్ నాట్ అలౌడ్’ చిత్రం సెన్సార్ క్లియరెన్స్ తెచ్చుకోలేక పోవడం వల్ల విడుదలకు నోచుకోలేదు. కరోనా కారణంగా సినిమా ఇప్పట్లో విడుదల అయ్యే పరిస్థితి లేకపోవడంతో కొత్త పద్దతిన సినిమాను విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా షకీలా పేర్కొంది. సినిమా సెన్సార్ కోసం చాలా తిరిగాను. అప్పులు తెచ్చి సినిమా తీశాను. ఇప్పుడు అప్పుల వాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. ఈ సమయంలో డిజిటల్ గా సినిమా విడుదల గురించి తెలుసుకున్నాను. 50 రూపాయల టికెట్టు రేటు పెట్టి సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ షకీలా పేర్కొంది.
సినిమా టైటిల్ లేడీస్ నాట్ అలౌడ్ అనే పేరుతో వెబ్ సైట్ ను ప్రారంభించి సినిమాను అందులో విడుదల చేయబోతున్నాం. 50 రూపాయలు చెల్లించే వారు సినిమాను చూడవచ్చు. జులై 20వ తారీకు రాత్రి 8 గంటల నుండి సినిమాను ఆన్ లైన్‌లో ఉంచబోతున్నట్లుగా షకీలా పేర్కొంది. తనను ఆర్థికంగా ఆదుకునేందుకు దయచేసి మగాళ్లంతా సినిమాను చూడాలంటూ షకీలా విజ్ఞప్తి చేసింది.