Begin typing your search above and press return to search.
ఎట్టకేలకు షకీలా డర్టీ పిక్చర్ వచ్చేస్తోంది
By: Tupaki Desk | 8 Dec 2020 10:54 AM ISTసిల్క్ స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్ తర్వాత పలువురు సినీ ప్రముఖుల బయోపిక్ లు వచ్చాయి. డర్టీ పిక్చర్ తరహాలోనే సౌత్ ఇండియన్ స్టార్ లేడీ గా పేరు దక్కించుకున్న షకీలా బయోపిక్ ను చాలా కాలం క్రితమే మొదలు పెట్టారు. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమా కరోనా కారణంగా ఈ ఏడాది అంతా కూడా రెడీ అయినా విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు థియేటర్లు పునః ప్రారంభం అయిన కారణంగా షకీలా బయోపిక్ 'షకీలా' ను విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నారు.
ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో టైటిల్ రోల్ ను బాలీవుడ్ ముద్దుగుమ్మ రిచా చద్దా పోషించింది. ఈ సినిమాలో షకీలా దక్కించుకున్న కీర్తి నుండి మొదలుకుని ఆ తర్వాత ఎదుర్కొన్న పరిణామాలు అన్ని కూడా చూపించబోతున్నారు. ఒకానొక సమయంలో సౌత్ హీరోల సినిమాలకు పోటీగా షకీలా సినిమాలు నిలిచాయి. ఆమె సినిమాలు వస్తున్నాయి అంటే వేరే సినిమాలు పక్కకు తప్పుకునేవి. అంతటి క్రేజ్ ఉన్న హీరోయిన్ ఆస్తుల పరంగా ఎందుకు ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనేది కూడా చాలా మందికి తెలియని విషయం. అందుకే ఈ సినిమాలో ఆ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని అంతా ఎదురు చూస్తున్నారు.
షకీలా బయోపిక్ ను ఈనెల 25న సౌత్ అన్ని భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేయాలని నిర్ణయించారు. క్రిస్మస్ కానుకగా ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. కాని ఎక్కువ స్థాయిలో మాత్రం సినిమాలు రావడం లేదు. ముఖ్యంగా పెద్ద సినిమాలు విడుదల అవ్వడం లేదు. అందుకే ఇదే మంచి సమయం అన్నట్లుగా షకీలా మేకర్స్ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.