Begin typing your search above and press return to search.

పవన్ కు గుడి కట్టిస్తానంటున్న కమెడియన్

By:  Tupaki Desk   |   3 Nov 2015 5:35 AM GMT
పవన్ కు గుడి కట్టిస్తానంటున్న కమెడియన్
X
హీరోలు - హీరోయిన్లకు గుడి కట్టించే జనాల్ని తమిళనాడులోనే చూశాం. ఐతే మన దగ్గర కూడా ఓ హీరోకు గుడి కడతానని స్వయంగా ఓ కమెడియనే చెబుతున్నాడు. ఆ కమెడియన్ షకలక శంకర్ కాగా.. అతను కడతానంటున్న గుడి హీరో పవన్ కళ్యాణ్ ది. జబర్దస్త్ కామెడీ షోలో రామ్ గోపాల్ వర్మను ఇమిటేట్ చేయడం ద్వారా బాగా పాపులారిటీ సంపాదించిన షకలక శంకర్.. ఆ షోలో పవన్ మీద కూడా కొన్ని స్కిట్లు చేశాడు. అతడి తొలి స్కిట్ పవన్ మీదే. ‘జబర్దస్త్’ లో అతను చేసిన చివరి స్కిట్ కూడా పవన్ మీద చేసిందే. దానికి అద్భుతమైన స్పందన కూడా వచ్చింది.

ఐతే స్వతహాగా కూడా షకలక శంకర్ పవన్ కు వీరాభిమాని. అందుకే ఏదో ఒక రోజు తన సొంత ఊళ్లో తన అభిమాన కథానాయకుడికి గుడి కడతానంటున్నాడు. ఇటీవలే ‘రాజు గారి గది’ సినిమాలో పేలిపోయే కామెడీ చేసి.. మంచి పేరు తెచ్చుకున్న శంకర్ ఇటీవలే ఓ కార్యక్రమంలో భాగంగా ఓవర్సీస్ ఆడియన్స్ తో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓ పవన్ అభిమానితో మాట్లాడుతూ.. తానూ పవర్ స్టార్ కు వీరాభిమానినని.. తాను ఈ మాత్రం పేరు తెచ్చుకోవడంలో పరోక్షంగా పవన్ పాత్ర ఎంతో ఉందని.. తాను బాగా డబ్బు సంపాదించాక కచ్చితంగా తన ఊళ్లో పవన్ కు గుడి కడతానని చెప్పాడు షకలక శంకర్.