Begin typing your search above and press return to search.

3 డేస్ అంటున్న షకలక శంకర్

By:  Tupaki Desk   |   10 Feb 2018 5:05 PM GMT
3 డేస్ అంటున్న షకలక శంకర్
X
తెరపై ఓ చిన్న పాత్రలో కనిపించి నలుగురిని అలరిస్తే చాలు అనుకోని అవకాశాల కోసం తిరిగే వాళ్లు బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఈ HD కాలం వరకు బాగానే ఉన్నారు. ఒక్క అవకాశంతో ఏ మాత్రం క్లిక్ అయినా మళ్లీ తెరపై తప్ప స్టూడియోల దగ్గర కనిపించరు. 1% అదృష్టంతో పాటు 99% కష్టపడే తత్వం ఉంటేనే ఆ రేంజ్ కి వెళతారు. అయితే జబర్దస్త్ నుంచి వచ్చిన కమెడియన్స్ కి ఇప్పుడు దర్శకులు ఎక్కువగా స్వాగతం పలుకుతున్నారు. కమెడియన్ నుంచి హీరోలుగా మరెందుకు సైతం ఒకే అంటున్నారు.

ఇప్పటివరకు కామెడీయన్స్ చాలా మంది హీరోలుగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే. కానీ ఎక్కువగా అందరు సక్సెస్ అవ్వకపోయినా ఉన్నన్ని రోజులు పరవాలేదు అనిపించారు. అయితే ఇప్పుడు అదే తరహాలో ఒక జబర్దస్త్ కమెడియన్ హీరోగా ట్రై చేయాలని చూస్తున్నాడు. అతనే షకలక శంకర్. కొన్ని సినిమాల్లో ఇతని నటనకు చాలా మంచి ఆదరణ లభించింది. రెండు మూడు సీన్లకే అతని ఫేట్ మారిపోయింది. దీంతో హీరోగా కూడా ఒక అడుగు వేయడానికి రెడీ అయ్యాడు.

రీసెంట్ గా ఈ కమెడియన్ కొత్త సినిమాకు సంబంధించిన ఒక లుక్ ని కూడా రిలీజ్ చేశారు. పవర్ ఆఫ్ శంకర్ 3 డేస్ టూ గో.. అని ఉన్న ఆ పోస్టర్ లో శంకర్ శివాలయం వైపు తిరిగి దండం పెడుతున్నాడు. లుక్ చూస్తే బాగానే ఉంది. మరి మూడు రోజుల తరువాత ఏం చెబుతాడా అని అందరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. మరి కమెడియన్ గా మంచి రెస్పాన్స్ ను అందుకున్న షకలక శంకర్ హీరోగా కేరింతలు పెట్టిస్తాడా లేదా అనేది చూడాలి.