Begin typing your search above and press return to search.

ఇవేం మాటలు శంకర్!

By:  Tupaki Desk   |   26 Jun 2018 7:34 AM GMT
ఇవేం మాటలు శంకర్!
X
సినిమాల్లో చేస్తే వచ్చే గుర్తింపు అందులోనూ హీరోగా వచ్చే స్టేటస్ అంటే ఎవరికైనా మక్కువే.దానికి ఎవరూ అతీతులు కారు. అలా అని మన మీద మనకు నమ్మకం ఉంది కదాని అవతలి వాళ్లకు కూడా అంతే ఉండాలి అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. శంభో శంకర హీరో షకలక శంకర్ పరిస్థితి అచ్చం అలాగే ఉంది. ఈ నెల 29న విడుదల అవుతున్న ఈ సినిమా మీద ఏ మాత్రం బజ్ లేదు. కమెడియన్ హీరోగా చేయటం కొత్తేమి కాదు కానీ ఆలీ - సునీల్ లాంటి వాళ్ళు ఇలాంటి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళిద్దరికీ అప్పటికే చాలా ఇమేజ్ ఉంది. అది హెల్ప్ అయ్యింది కూడా. ఆయా సినిమాల విడుదల సమయానికే చెప్పుకోదగ్గ సినిమాలు చాలా చేసారు. గుర్తింపు కూడా భారీగా ఉంది.

కానీ షకలక శంకర్ కేసు వేరు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. శ్రీధర్ అనే దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చిన నిర్మాత పెట్టుబడి పెడతాను అన్నాడు. ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కింది. శంకర్ హీరో అయిపోయాడు. అదంతే. టైం కలిసివచ్చినప్పుడు అలా జరిగిపోతాయి. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ శంకర్ తీరు మాత్రం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. శంభో శంకర ఆడియో వేడుకలో శంకర్ మాటలు ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. ఏకంగా త్రివిక్రమ్-దిల్ రాజు-అల్లు శిరీష్-రవితేజ పేర్లను ప్రస్తావిస్తూ వాళ్ళు తన సినిమాకు నిర్మాతలుగా ఉండడానికి నో చెప్పడం అంటే ఏదో పెద్ద నేరం చేసినట్టు మాట్లాడిన తీరు సరికాదనే విషయం అందరు ఒప్పుకుంటున్నారు. రెండు కోట్లు పెట్టడానికి వాళ్ళు వెనుకడుగు వేయడాన్ని చాలా వ్యంగ్యంగా ఎటకారంగా శంకర్ మాట్లాడిన తీరు చూస్తే మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ టన్నుల్లో కనిపిస్తోంది.

వందల కోట్ల సినిమాలు చేసే స్టార్ హీరోలే అణుకువతో నడుచుకుంటూ ఉంటే ఇంకా విడుదల కానీ సినిమాకే ఇంత విర్రవీగటం ఏంటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దిల్ రాజు హాస్పిటల్ లో ఉన్న విషయాన్ని త్రివిక్రమ్ రెండేళ్లు ఆగు చూద్దాంలే అని చెప్పడాన్ని అల్లు శిరీష్ గీత సంస్థ తన చేతికి రాలేదని చెప్పడాన్ని అతిశయోక్తిగా చెప్పుకున్న షకలక శంకర్ పవన్ నామస్మరణ చేస్తే చాలు ఇంకెవరు అక్కర్లేదు అనే రీతిలో రెచ్చిపోవడం పవన్ ఫాన్స్ కి సైతం చిరాగ్గా ఉంది. శంకర్ అనుకున్నట్టు శంభో శంకరను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఉత్సాహంతో ప్రేక్షకులు లేరు. దానికి తోడు ట్రైలర్ లో శంకర్ బాడీ లాంగ్వేజ్ కి ఏ మాత్రం సెట్ కానీ ఓవర్ హీరోయిజంని చూపించినట్టు క్లియర్ గా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో తన కంటే సినిమా సక్సెస్ మాట్లాడితే బాగుంటుంది అనే ప్రాధమిక సూత్రాన్ని మర్చిపోయిన శంకర్ ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. నిజాలు మాట్లాడ్డం తలపొగరుగా చెప్పుకోవడం రెండు ఒకటే అనుకున్నప్పుడే ఇలాంటి స్పీచులు వస్తాయి.