Begin typing your search above and press return to search.

షాక్‌: క‌రీంన‌గ‌ర్ రోడ్ల‌పై క‌మెడియ‌న్ భిక్షాట‌న?!

By:  Tupaki Desk   |   18 Sept 2020 11:00 AM IST
షాక్‌: క‌రీంన‌గ‌ర్ రోడ్ల‌పై క‌మెడియ‌న్ భిక్షాట‌న?!
X
తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణ రోడ్ల‌పై క‌మెడియ‌న్ ష‌క‌ల‌క శంక‌ర్‌ భిక్షాట‌న చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇది శంక‌ర్ ప‌బ్లిసిటీ కోసం చేశాడ‌నుకుంటే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్టే. ఓ ప‌‌ని మీద క‌రీంన‌గ‌ర్ వెళ్లిన ష‌కల‌క శంక‌ర్ అక్క‌డి పేద వారి కోసం ఏదైనా చేయాల‌నుకున్నార‌ట‌. పూర్ ఫ్యామిలీస్ ‌కి అండ‌గా నిల‌వాల‌నుకున్నాడ‌ట‌.

ఆలోచ‌న వ‌చ్చిందే త‌డ‌వుగా క‌రీంన‌గ‌ర్ రోడ్ల‌పై భిక్షాట‌న చేయ‌డం మొద‌లుపెట్టాడ‌ట‌. ఇలా భిక్షాట‌న చేసి 90 వేలు సేక‌రించార‌ట. దానికి త‌న వ‌ద్ద వున్న ప‌ది వేలు క‌లిపి కోవిడ్ కార‌ణంగా ప‌ని కోల్పోయి దీనావ‌స్థ‌లో కాలం వెల్ల‌దీస్తున్న కుటుంబాల‌కు అంద‌జేయ‌డం అభినంద‌నీయం అని అంతా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇదే త‌ర‌హాలో ప్ర‌తి నెలా భిక్షాట‌న చేసి ఆర్థికంగా చితికి పోయిన తెలుగు ఫ్యామిలీస్ కి అందిస్తాన‌ని ష‌క‌ల‌క శంక‌ర్ భావిస్తున్నార‌ట‌. ఆ రోజుల్లో దివిసీమ ఉప్పెన స‌మ‌యంలో అన్న‌గారు స్వ‌ర్గీయ ఎన్టీరామారావు `భిక్షాట‌న‌` చేసి తెలుగు ప్ర‌జ‌ల‌కు ఆర్థిక సాయం చేసిన విష‌యం తెలిసిందే. అదే త‌ర‌హాలో ష‌క‌ల‌క శంక‌ర్ కూడా భిక్ష‌ట‌న చేసి పేద ప్ర‌జ‌ల్ని ఆదుకోవాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం నిజంగా అభినంద‌నీయమే.