Begin typing your search above and press return to search.

మరగుజ్జు సంచలనాలు సృష్టిస్తున్నాడు

By:  Tupaki Desk   |   3 Nov 2018 3:30 PM GMT
మరగుజ్జు సంచలనాలు సృష్టిస్తున్నాడు
X
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ తాజాగా ‘జీరో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో షారుఖ్‌ మరుగుజ్జుగా కనిపించబోతున్నాడు. చాలా సంవత్సరాల క్రితం విచిత్ర సహోదరులు చిత్రంలో కమల్‌ మరగుజ్జుగా కనిపించాడు. అప్పట్లో కమల్‌ సంచలనం సృష్టించగా ఇప్పుడు ఇప్పుడు షారుఖ్‌ కాస్త పొడవాటి మరగుజ్జుగా కనిపించబోతున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ సోషల్‌ మీడియాను కుదుపు కుదిపేస్తోంది. ‘జీరో’ ట్రైలర్‌ కు మంచి రెస్పాన్స్‌ దక్కింది. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేలా ఈ ట్రైలర్‌ ఉంది. యూట్యూబ్‌ లో ట్రైలర్‌ వ్యూస్‌ మరియు లైక్స్‌ రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి.

యూట్యూబ్‌ లో ఈ చిత్రం ట్రైలర్‌ వ్యూస్‌ దాదాపుగా మూడున్నర కోట్లకు చేరుకుంది. ఇక లైక్స్‌ విషయంలో మిలియన్‌ క్లబ్‌ లో చేరిపోయింది. తన సొంత బ్యానర్‌ లో షారుఖ్‌ నిర్మించిన ఈ చిత్రం బాలీవుడ్‌ వర్గాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అంచనాలను పెంచుతోంది. భారీ బడ్జెట్‌ తో విభిన్నమైన కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన ఈ చిత్రంతో షారుఖ్‌ సక్సెస్‌ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

గత కొంత కాలంగా ఇతర ఖాన్స్‌ అయిన అమీర్‌ ఖాన్‌ - సల్మాన్‌ ఖాన్‌ లతో పోటీ పడలేక పోతున్న షారుఖ్‌ ఖాన్‌ ఈ చిత్రంతో వారిని ఢీ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. పైగా ఈ చిత్రంలో ఆ ఇద్దరు ఖాన్స్‌ ఉండటం కూడా అదనపు ఆకర్షణగా చెబుతున్నారు. అనుష్క శర్మ మరియు కత్రీనా కైఫ్‌ ఈ చిత్రంలో హీరోయిన్స్‌ గా కనిపిస్తున్న విషయం తెల్సిందే. కత్రీనా అందాలతో పాటు, షారుఖ్‌ కు ముద్దు పెట్టే సీన్‌ కూడా సినిమాలో అదిరిపోతుందని షారుఖ్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.