Begin typing your search above and press return to search.

ఇలా కూడా తగ్గుతారా షారూక్

By:  Tupaki Desk   |   1 Jan 2018 1:54 PM GMT
ఇలా కూడా తగ్గుతారా షారూక్
X
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ కి.. ఆయన రేంజ్ కి తగిన సినిమా వచ్చి చాలాకాలమే అయింది. హిట్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా బాలీవుడ్ బాద్షా స్థాయిలో కలెక్షన్స్ రాలడం లేదు. అయితే.. సరైన సినిమా ఒక్కటి వస్తే చాలు.. షారూక్ ఖాన్ తన టాప్ స్థానాన్ని దక్కించుకోవడం సాధ్యమేనని అంటారు బాలీవుడ్ జనాలు.

అందుకు తగ్గ ప్రాజెక్ట్ ఇప్పుడు షారూక్ చేతికి చిక్కినట్లే కనిపిస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో షారూక్ నటిస్తున్న మూవీకి.. ఇప్పుడు టైటిల్ అనౌన్స్ చేశారు. 'జీరో' అనే పేరుపై ఈ చిత్రం రూపొందుతుండగా.. టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటే షాక్ ఇచ్చేశారు మేకర్స్. పేరు ప్రకటించడం కోసం రిలీజ్ చేసిన వీడియోలో.. సినిమాకు సంబంధించిన అసలు థీమ్ చెప్పేశారు. షారూక్ ఖాన్ మరుగుజ్జుగా నటించబోతున్నాడని చెప్పడమే కాదు.. అందుకు సంబంధించిన లుక్ ని కూడా రివీల్ చేసేశారు.

మరుగుజ్జు అంటే గతంలో మాదిరిగా చూపించీ చూపించకుండా కాకుండా.. ఒరిజినల్ గానే షారూక్ అలా మారిపోయిన స్థాయిలో పిక్చరైజేషన్ చేయడం విశేషం. ప్రస్తుతం గ్రాఫిక్స్ హైలెవెల్ లో అందుబాటులోకి రావడంతో.. ఇలా సాధ్యమైందని అర్ధం చేసుకోవచ్చు కానీ.. ఆ పాత్రలో కింగ్ ఖాన్ జీవించేసిన విధానం మాత్రం సూపర్బ్ అనాల్సిందే. ఈ చిత్రంతో పాటు 1970ల కాలం నాటికి సంబంధించిన టైటిల్స్ ను చూపిస్తూ.. జీరో మూవీ బ్యాక్ డ్రాప్ కూడా ఆ కాలం నాటిదే అని చెప్పకనే చెప్పారు మేకర్స్.