Begin typing your search above and press return to search.

సిక్స్ ప్యాక్... సన్నాఫ్ షారూక్

By:  Tupaki Desk   |   18 Aug 2015 7:06 AM GMT
సిక్స్ ప్యాక్... సన్నాఫ్ షారూక్
X
షారూక్ ఖాన్... ఈ బాలీవుడ్ దిల్వాలే... బాడీ ఫిట్ నెస్ పై ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో అందరికీ తెలుసు. 49ఏళ్ల వయసులోనూ లవర్ బోయ్ లా. అమ్మాయిల కలల రాకుమారుడిగా కనిపించడమంటే మామూలు విషయం కాదు. ఓ శాంతి ఓం లో సిక్స్ ప్యాక్ చేసి సెన్సేషన్ సృష్టించిన షారుక్... హ్యాపీ న్యూ ఇయర్ లో ఎయిట్ ప్యాక్ చూపించి... దేశం మొత్తాన్ని షాక్ లోకి నెట్టేశాడు. తండ్రికి తగ్గ వారసుడిగా కనిపిస్తున్నాడు షారూక్ కొడుకు ఆర్యన్.

మామూలుగా ఆర్యన్ కి మీడియా అంటే వల్లమాలిన సిగ్గు. అందుకే కాస్త దూరంగానే ఉండేందుకు ప్రయత్నిస్తాడు. కానీ లేటెస్ట్ గా ఓ బీచ్ లో మన సన్నాఫ్ షారూక్ స్విమ్ వేర్ తో కనిపించాడు. సోషల్ మీడియాలోకి ఈ పిక్స్ వచ్చేశాయి. ఆర్యన్ ఫిట్ నెస్, యాబ్స్ చూస్తే.. షారూక్ సిసలైన వారసుడిగా కనిపిస్తున్నాడంటూ నెటిజన్లు నెత్తిన పెట్టేసుకుంటున్నారు.

ఇంతకీ మనోడి ఏజ్ ఇంకా 17 ఏళ్లే. ప్రస్తుతం లండన్ లోని ఓ హైయర్ స్కూల్ లో స్టడీస్ కంప్లీట్ చేస్తున్నాడు. బీచ్ ఫోటోస్ చూస్తుంటే ఇప్పుడే తండ్రికి కార్బన్ కాపీలా కనిపిస్తున్నాడు కదూ. సినిమాల్లోకి వస్తాడనే రూమర్స్ ఉన్నా... ఇప్పటివరకూ షారూక్ వీటిని కన్ ఫాం చేయలేదు.