Begin typing your search above and press return to search.

ఏ తండ్రి.. ఏ కొడుకు విషయంలో కోరుకోనిది కోరుకున్న షారుక్.. ఇప్పుడేమైంది?

By:  Tupaki Desk   |   4 Oct 2021 3:32 AM GMT
ఏ తండ్రి.. ఏ కొడుకు విషయంలో కోరుకోనిది కోరుకున్న షారుక్.. ఇప్పుడేమైంది?
X
‘నా కొడుకు సిగిరెట్ తాగొచ్చు. అమ్మాయిలతో డేటింగ్ చేయొచ్చు. సెక్సు చేయొచ్చు. డ్రగ్స్ తీసుకొవచ్చు. ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలో అన్ని రకాలుగా చేయొచ్చు..’ ప్రపంచంలో ఏ తండ్రి అయినా తన కొడుకు ఇలా తన కొడుకు పెరగాలని కోరుకుంటాడా? కానీ.. బాలీవుడ్ బాద్షా.. కోట్లాది మంది ఆరాధ్యదైవంగా కొలిచే షారుక్ ఖాన్ మాత్రం.. ఇలాంటివన్నీ తన కొడుకు చేయాలని సరదాగా కోరుకున్నాడు. నువ్వు సరదాగా కోరకున్నావ్.. నేను సీరియస్ గా అవన్నీ చేసేస్తా.. అన్నట్లుగా షారుక్ కొడుకు ఇప్పుడు ఇలాంటివి చాలానే చేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఒక క్రూయిజ్ లో ఏర్పాటు చేసిన భారీ పార్టీలో డ్రగ్స్ ను వాడుతూ.. ప్రత్యేక విభాగానికి అడ్డంగా దొరికిపోయాడు షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టు అయ్యాడు. అతడితో పాటు మరికొందరు ప్రముఖుల పిల్లలు ఉండటం తెలిసిందే. దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ సందర్భంగా గతంలో షారుక్ ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో తన కొడుకు జీవితాన్ని ఎంతలా ఎంజాయ్ చేయాలన్న దానికి సరదాగా షారుక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ఎంత సరదా అయితే మాత్రం.. కన్నకొడుకు చెడు అలవాట్ల బారిన పడాలని తండ్రి కోరుకోవటం ఏమిటి? ఇలాంటివి చేయాలని ఏ తండ్రి అయినా తన కొడుకు విషయంలో కలలో కూడా కోరుకోడు. కానీ.. షారుక్ మాత్రం తన భార్య గౌరీతో కలిసి సిమిగేర్ వాల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను యవ్వనంలో ఉన్నప్పుడు చేయని పనులన్ని తన కొడుకు చేయాలని కోరుకోవటం ఈ ఇంటర్వ్యూలో స్పష్టంగా కనిపిస్తుంది.

‘నా కొడుకు అమ్మాయిలతో డేటింగ్‌ చేయొచ్చు. సిగరెట్‌ తాగొచ్చు. సెక్స్‌, డ్రగ్స్‌ని కూడా ఆస్వాదించొచ్చు. అన్ని రకాలుగా అతను ఎంజాయ్‌ చేయవచ్చు' అన్న మాటల్ని కొడుకు అక్షరం తప్పు పోకుండా ఫాలో అయి.. తీరని తలవంపులు తెచ్చారని చెప్పాలి. ఇప్పటికైనా.. ఇలాంటి ఆలోచనలు ఉన్న తండ్రులు.. వాటికి కట్టిపెట్టి.. తన పిల్లలు బాధ్యతగా.. దేశానికి సంపదగా మారాలని కోరుకోవాలే కానీ.. ఇలాంటి చెత్త అలవాట్లకు కేరాఫ్ అడ్రస్ గా మారితే.. షారుక్ కొడుకు లెక్క పెడుతున్న ఊచలు ఎవరైనా ఎప్పుడైనా పెట్టే వీలుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.