Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కొడుకు అరెస్ట్..

By:  Tupaki Desk   |   3 Oct 2021 11:49 AM GMT
బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కొడుకు అరెస్ట్..
X
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసినట్టు ఎన్సీబీ అధికారులు తెలిపినట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక కాసేపట్లో కోర్టులో ఆర్యన్ ఖాన్ ను హాజరుపరుచనున్నారు.

ఆర్యన్ ఖాన్ తోపాటు మొత్తం 8మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఐదు ప్రాంతాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం నుంచి ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ డ్రగ్స్ కేసులో ఆధారాలు లభించడంతో ఆర్యన్ ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అతడితోపాటు అర్భాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచాలను కూడా అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో ఉన్న ఆర్యన్ ను పోలీసులు స్థానిక ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేసిన తర్వాత జడ్జి ముందు హాజరుపరిచారు. ముంబై డ్రగ్స్ కేసులో సంచలనాలు బయటకు వస్తున్నాయి. నిందితుల నుంచి వస్తున్న సమాచారంతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇక తీగలాగితే డొంక కదిలినట్టు బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు హైదరాబాద్ తో లింక్స్ దొరికాయి.. హైదరాబాద్ టు ముంబైకి డ్రగ్స్ సప్లై అవుతోంది. మేడ్ ఇన్ హైదరాబాద్ బ్రాండ్ ముంబైలో మారు మోగుతోంది. హైదరాబాద్ పారిశ్రామిక వాడల్లో ఈ డ్రగ్స్ తయారైనట్టు గుర్తించారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన షారుఖ్ ఖాన్ కు ఇప్పుడు తన కుమారుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం శరాఘాతంగా మారింది. రేవ్ పార్టీలో అతడు డ్రగ్స్ తో పట్టుబడినట్లు చెబుతున్నారు.షారుఖ్-గౌరీ ఖాన్ ల పెద్ద కుమారుడ్ ఆర్యన్ ఖాన్. వీరిద్దరికి తొలి సంతానంగా 1997లో ఆర్యన్ పుట్టాడు. మీడియాకు కొంత దూరంగానే షారుఖ్ తన కుమారుడిని పెంచాడు. ప్రస్తుతం ఆర్యన్ వయసు 23 ఏళ్లు. ఆర్యన్ లండన్ లోని సెవెన్ వోక్స్ లో పాఠశాల విద్య పూర్తి చేశాడు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్ పూర్తి చేశాడు.