Begin typing your search above and press return to search.

కింగ్ ఖాన్ కాలేజ్ వెతుకుతున్నాడా?

By:  Tupaki Desk   |   16 Aug 2016 10:30 PM GMT
కింగ్ ఖాన్ కాలేజ్ వెతుకుతున్నాడా?
X
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉన్నాడు. బాలీవుడ్ హీరోలు యూఎస్ లో చక్కర్లు కొట్టడం సహజంగా జరిగేదే. రకరకాల కార్యక్రమాలు.. ఈవెంట్స్ కోసం ఇలా తిరిగేస్తూ ఉంటారు. పైగా పలు కాన్సర్ట్స్ కోసం వీరికి స్పెషల్ ఇన్విటేషన్లు అందుతుంటాయి. లాస్ ఏంజల్స్ కి ఫ్యామిలీతో సహా షారుక్ వెళుతుంటే.. ఇదో ఫ్యామిలీ టూర్ అనుకున్నారంతా.

కానీ ఇప్పుడు షారూక్ చేసిన ఓ ట్వీట్ చాలానే అనుమానాలు రేకెత్తించింది. 'యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో ఉన్నాను. చాలామంది యువతీ యువకులు పలకరించారు. ఎన్నో కౌగిలింతలు.. మరెన్నో సెల్ఫీలు.. ఇంత మంది స్వాగతించినందుకు థ్యాంక్స్.. పిల్లల కోసం పోరాటం' అంటూ ట్వీట్ చేశాడు షారూక్ ఖాన్. మొత్తం అంతా బాగానే ఉంది చివర్లో పిల్లల దగ్గరకొచ్చేసరికి పోరాటం అన్న దగ్గరే అసలు పాయింట్ మొదలైంది.

కాలిఫోర్నియాలో తన పిల్లలు ఆర్యన్- సుహానాలకు కాలేజ్ సీట్ వెతుక్కుంటున్నాడని టాక్ బయల్దేరింది. స్టార్స్ పిల్లలు ఫారిన్ దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేయడం చూస్తున్నదే. ఇప్పుడు షారూక్ ఖాన్ కూడా ఇదే రూట్ లో ఉన్నాడని అంటున్నారు. మరి పిల్లల కోసం పోరాటం ఏమయిందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.