Begin typing your search above and press return to search.

ఫాన్స్‌ గుండెల్ని కెలికేసే ఎటెంప్ట్‌

By:  Tupaki Desk   |   13 July 2015 3:29 AM GMT
ఫాన్స్‌ గుండెల్ని కెలికేసే ఎటెంప్ట్‌
X
కింగ్‌ఖాన్‌ ఏ ఎటెంప్ట్‌ చేసినా సంచలనమే. అతడు ఈసారి ఓ కొత్త ఎటెంప్ట్‌ చేస్తున్నాడు. అదీ డబుల్‌ రోల్‌లో. పైగా రెండు పాత్రల్లోనే తనే కనిపిస్తాడు. ఒకరు సూపర్‌స్టార్‌ అయితే ఇంకొకరు ఫ్యాన్‌. అందుకే సినిమా టైటిల్‌ కూడా 'ఫ్యాన్‌' అని పెట్టారు. ఒక సూపర్‌స్టార్‌తో అభిమాని అనుబంధం గురించిన సినిమా ఇది. మనీష్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించడం ఖాయం అన్న అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. షారూక్‌ అభిమానులకు విజువల్‌ ఫీస్ట్‌ షురూ అని చెబుతున్నారు.

ఓసారి బాద్‌షా కెరీర్‌ని తరచి చూస్తే ఇంతవరకూ రెండే రెండు సార్లు ద్విపాత్రాభినయం చేశాడు. డూప్లికేట్‌, ఓం శాంతి ఓం చిత్రాల్లో రెండేసి పాత్రల్లో నటించాడు. అయితే ఆ రెండిటి కంటే విభిన్నమైన చిత్రమిది. ఈ చిత్రం ఆద్యంతం షారూక్‌ రెండు పాత్రల్లో కనిపించి మెస్మరైజ్‌ చేస్తాడు. ముఖ్యంగా అభిమాని పాత్రలో అతడి అభినయం సంచలనం అవుతుందని దర్శకుడు చెబుతున్నాడు. అంతేనా షారూక్‌ నిజజీవితం నుంచి కొన్ని విషయాల్ని తీసుకుని సూపర్‌స్టార్‌ పాత్రకి ఆపాదిస్తున్నారు. టెక్నికల్‌గా ఇదో వండర్‌గా నిలిచే చిత్రమిదని చెబుతున్నాడు. ఏదేమైనా షారూక్‌ ఒకే ఫ్రేమ్‌లో రెండు రూపాల్లో కనిపించి మెస్మరైజ్‌ చేయబోతున్నాడన్నది సెన్సేషన్‌.