Begin typing your search above and press return to search.

షారుక్ ఇచ్చిన పార్టీలో స్టార్ హీరో వైఫ్ లు బాత్రూంలో అలా!

By:  Tupaki Desk   |   7 Oct 2021 4:30 AM GMT
షారుక్ ఇచ్చిన పార్టీలో స్టార్ హీరో వైఫ్ లు బాత్రూంలో అలా!
X
బాలీవుడ్ ‘మత్తు’ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇచ్చిన ఒక పార్టీలో తాను చూసిన సీన్ గురించి షాకింగ్ విషయాల్ని చెప్పి సంచలనంగా మారారు షెర్లిన్ చోప్రా. తాజాగా డ్రగ్స్ వినయోగం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. గతంలో తాను చెప్పిన విషయాలకు సంబంధించిన ఒక వీడియోను తాజాగా మరోసారి షేర్ చేశారు షెర్లిన్ చోప్రా.

రీల్ మీద తన అందాలతో కిక్కు ఎక్కించే షెర్లిన్.. సంచలన వాస్తవాల్ని కుండబద్ధలు కొట్టటంలో ఆమె అస్సలు వెనుకాడరు. ఈ మధ్యన రాజ్ కుంద్రా ఎపిసోడ్ లోనూ సంచలన అంశాల్ని మొహమాటం లేకుండా బయటపెట్టటమే కాదు.. ఇష్యూను మరింత సీరియస్ చేయటంలో షెర్లిన్ వ్యాఖ్యలు కూడా కారణంగా చెప్పాలి. తాజా ఆమె షేర్ చేసిన పాత వీడియోలో.. షారుక్ ఇచ్చిన ఒక పార్టీకి హాజరైన స్టార్ హీరోల సతీమణులు బాత్రూంలో ఏం చేస్తున్నారో చెప్పి షాకిచ్చింది.

షారుక్ కు ఐపీఎల్ కోల్ కతా నైట్ రైడర్స్ టీం ఉండటం తెలిసిందే. దానికి సంబంధించిన పార్టీ ఒకటి షారుక్ ఇచ్చారు. ఆ పార్టీకి తాను కూడా వెళ్లినట్లు చెప్పిన షెర్లిన్.. డ్యాన్స్ చేసి అలసిపోయి వాష్ రూంకు వెళ్లానని.. డోర్ ఓపెన్ చేసినంతనే తన కంటి ముందు కనిపించిన దానికి షాక్ అయినట్లు చెప్పారు. తాను తప్పుడు అడ్రస్ కు వచ్చానా? అన్న భావన కలిగిందని.. కానీ తానుసరైన ప్లేస్ కే వచ్చానని.. బాత్రూంలో స్టార్ హీరల సతీమణులు తెల్లటి పౌడర్ ను పీలుస్తూ కనిపించారని.. విషయం అర్థమై షాక్ తిన్నట్లు చెప్పారు.

వారంతా కొకైన్ లాంటి తెల్లటి పదార్థాన్ని పీలుస్తున్నారని.. తాను వారిని చూసి నవ్వి బయటకు వచ్చేసినట్లు చెప్పారు. అనంతరం అక్కడి నుంచి త్వరగా బయటకు వచ్చేశానని.. ఆ రోజే బాలీవుడ్ లో జరిగే పార్టీల గురంచి తనకు తెలిసిందని పేర్కొంది. ఏమైనా షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోయి.. అతనికి మిగిలిన బాలీవుడ్ ప్రముఖులు అండగా నిలవటమే కాదు.. చిన్నపిల్లాడు.. మంచోడు అంటూ కితాబుతు ఇస్తున్న వేళ.. షెర్లిన్ షేర్ చేసిన పాత వీడియో.. ఇప్పుడు పెనుసంచలనంగా మారిందని చెప్పక తప్పదు.