Begin typing your search above and press return to search.

భామలకు ఆఫర్స్ అందుకే అందట్లేదు

By:  Tupaki Desk   |   18 Jan 2017 10:35 AM IST
భామలకు ఆఫర్స్ అందుకే అందట్లేదు
X
ఎప్పుడో 1990ల్లో యాక్టింగ్ మొదలుపెట్టి.. ఖాన్లతో సహా బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇప్పటికీ సూపర్ స్టార్స్ గా వెలిగిపోతున్నారు. మరి అదే సమయంలో టాప్ హీరోయిన్స్ గా వెలిగిపోయినవారు మాత్రం ఇప్పుడు తెరమరుగు అయిపోవాల్సి వచ్చింది. కాజోల్.. మాధురీ దీక్షిత్.. జూహీ చావ్లా లాంటి అందగత్తెలంతా అప్పట్లో వైభోగం వెలగబోసిన వాళ్లే. కానీ ఇప్పుడు వారికి ఛాన్సులు ఇచ్చేందుకు ఇండస్ట్రీ సిద్ధంగా లేదు.

మేల్.. ఫిమేల్ నటుల మధ్య ఎందుకీ విబేధం అంటూ షారూక్ ఖాన్ కి ప్రశ్న ఎదురైంది. ఓ విమెన్ మేగజైన్ ఇంటర్వ్యూలో భాగంగా ఎదురైన ఈ ప్రశ్నకు షారూక్.. ఓపెన్ గానే ఆన్సర్ చెప్పేశాడు. 'మాధురి.. జూహీ.. కాజోల్.. వీరంతా అందమైన అద్భుతమైన యాక్టర్స్. నేను ఇప్పుడు స్టార్ గా ఉన్నానంటే అందుకు వారే కారణం. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా వారికి నా సినిమాలో అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. కానీ అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే.. ఇది ఎంతటి క్రియేటివ్ ఫీల్డ్ అయినా.. చివరకు ఒక వ్యాపారమే' అనేశాడు కింగ్ ఖాన్.

'సినిమా అనేది కళ. ఇది మోనాలిసా అందాన్ని నిర్వచించినట్లు కాదు. రకరకాల జోనర్లకు సంబంధించిన అంశాల్లో ఎంతో గుర్తిపు సంపాదించచ్చు. సినిమాను మార్కెట్ నిర్ణయిస్తుంది. ఎక్కువ మంది ఆడియన్స్ కుర్రభామలనే చూడాలని కోరుకుంటారు. అందుకే ఆ తరం వారు ఎంతటి అందగత్తెలైనా.. ట్యాలెంట్ ఉన్నా అవకాశాలు రావు' అంటూ అసలు సీక్రెట్ చెప్పేశాడు షారూక్ ఖాన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/