Begin typing your search above and press return to search.

సత్తా ఉంటేనే స్టార్ అవ్వాలంటున్నాడు

By:  Tupaki Desk   |   13 April 2016 11:00 PM IST
సత్తా ఉంటేనే స్టార్ అవ్వాలంటున్నాడు
X
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించిన ఫ్యాన్ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఈనెల 15న థియేటర్లలోకి వస్తున్న ఫ్యాన్ లో.. షారూక్ డ్యుయల్ రోల్ పోషించాడు. రీసెంట్ గా వచ్చిన షారూక్ మూవీ దిల్ వాలే ఫ్లాప్ కావడంతో.. ఈ మూవీపై చాలానే అంచనాలు ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులు తనకు కొత్తేం కాదంటున్నాడు షారూక్ ఖాన్.

రెండున్నర దశాబ్దాల తన కెరీర్ లో ఇలాంటి పరిస్థితులు ఎన్నింటినో చూశానన్నది షారూక్ వెర్షన్. అసలు అలాంటి బర్డెన్ మోయలేనపుడు.. స్టార్ హీరోగా మారకూడదంటున్నాడీ బాలీవుడ్ హీరో. ఈ సినిమాలో తనకు తనే ఫ్యాన్ గా నటించానని.. అయితే రియల్ లైఫ్ లో మాత్రం తాను ఎవరికీ ఫ్యాన్ కాదంటున్నాడు. ఎవరినైనా అభిమానించేంతగా టైం ఎప్పుడూ దొరకలేదట షారూక్ కి. 7-8 ఏళ్ల క్రితం అయితే ఇలాంటి సినిమా తీసే అవకాశం ఉండేది కాదని.. ప్రస్తుతం వీఎఫ్ ఎక్స్ అభివృద్ధి సాధించిన తీరు కారణంగానే.. ఇలాంటి విభిన్నమైన చిత్రాలు చేయగలగుతున్నట్లు చెప్పాడు షారూక్.

కమర్షియల్ చిత్రాలతో పాటు తాను ఎన్నో ఆఫ్ బీట్ సినిమాలు కూడా చేసి సక్సెస్ సాధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు బాలీవుడ్ బాద్షా. కొత్త డైరెక్టర్లతో సినిమాలు తీసేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని.. వారిలో కొత్త ఆలోచనలతో వచ్చి ఇండస్ట్రీలో మార్పులు తీసుకురాగలిగే వాళ్లుంటారంటున్నాడు షారూక్. .