Begin typing your search above and press return to search.

షూటింగ్ కోసం డైలీ హెలికాప్టర్లో..

By:  Tupaki Desk   |   6 April 2018 6:07 AM GMT
షూటింగ్ కోసం డైలీ హెలికాప్టర్లో..
X

సినిమా హీరోలు అంటే బిజీ షెడ్యూల్ ఉండడం సహజం. ఇక స్టార్ హీరోలు అంటే ఈ బిజీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. బాలీవుడ్ లో అయితే అటు పార్టీలు.. ఇటు ఈవెంట్లు.. సినిమా షూటింగులు అన్నీ కవర్ చేయాలి కాబట్టి.. టైం ఇంకా తక్కువగా ఉంటుంది. షారూక్ ఖాన్ లాంటి హీరో ఫుల్ బిజీగా ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

కానీ షారూక్ షెడ్యూల్ ను ఓ అంశం ఇబ్బంది పెడుతోందట. అదే ముంబైలో రోడ్ల మీద ట్రాఫిక్. ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నా.. షూటింగ్ స్పాట్ కి ఆలస్యం అవుతోందట. ప్రస్తుతం జీరో అనే టైటిల్ పై రూపొందుతున్న మూవీలో యాక్ట్ చేస్తున్నాడు కింగ్ ఖాన్. ఏడాది చివరకు విడుదల చేసేందుకు షెడ్యూల్ చేసిన ఈ మూవీ షూటింగ్ ని చకచకా ఫినిష్ చేసేలా ప్లాన్ చేశారు. కానీ ముంబై ట్రాఫిక్ ఇబ్బంది పెడుతుండడంతో.. రోజూ షూటింగ్ స్పాట్ కు వచ్చేందుకు.. షారూక్ ఖాన్ కు స్పెషల్ గా ఓ హెలికాప్టర్ ఏర్పాటు చేయడం సెన్సేషన్ అవుతోంది.

ఎంత బిజీ అయినా.. రోజూ ఛాపర్ ఇవ్వడం అంటే చిన్న సంగతి కాదు. సీఎం.. పీఎంలు ఇలా రెగ్యులర్ గా స్పెషల్ ఫ్లైట్స్.. హెలకాప్టర్ వాడడం చూస్తుంటాం. కానీ అదేదో సొంత కారు వాడినట్లుగాను.. ఓలా క్యాబ్ ఉపయోగించినట్లుగాను.. ఏకంగా హెలికాప్టర్ లో డైలీ షూటింగ్ స్పాట్ కు వెళ్లి రావడం మాత్రం.. ఒక్క షారూక్ ఖాన్ కే చెల్లింది.