Begin typing your search above and press return to search.

హీరో కూతురు కవర్ పేజీకి ఎక్కేసింది

By:  Tupaki Desk   |   2 Aug 2018 1:30 AM GMT
హీరో కూతురు కవర్ పేజీకి ఎక్కేసింది
X
బాలీవుడ్లో మరో వారసురాలు అతి త్వరలోనే తెరంగేట్రం చేయబోతోందని స్పష్టమైపోయింది. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ముద్దుల తనయురాలు సుహానా ఖాన్.. ఇప్పటికే ఇంటర్నెట్లో తన హాట్ హాట్ పోజులతో సెన్సేషన్ అయి కూర్చుంది. రెండేళ్ల ముందు వరకు చిన్న పిల్లలా కనిపించిన ఆమె.. ఈ మధ్య బాలీవుడ్ హాట్ హీరోయిన్లకు దీటుగా ఫొటో షూట్లు చేసి తాను ఎంచుకోబోయే కెరీర్ ఏదో సంకేతాలు ఇచ్చేసింది. తాజాగా సుహానా ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ‘వోగ్’ కవర్ పేజీకి ఎక్కేయడం విశేషం. ఎప్పుడూ స్టార్ హీరోయిన్లకే కవర్ పేజీలో చోటిచ్చే ఈ మ్యాగజైన్.. సుహానా ముఖచిత్రంతో ఇష్యూ తేవడం విశేషమే.

ఈ ఎడిషన్ ను స్వయంగా సుహానా తండ్రి షారుఖే ఆవిష్కరించడం విశేషం. ముఖ చిత్రం మీదే కాదు.. లోపల కూడా సుహానా గ్లామరస్ ఫొటోలతో కనువిందు చేసింది. ఆమె లుక్ లో చాలా మార్పు కనిపిస్తోంది. హీరోయిన్ ఫీచర్లు వచ్చేసినట్లే కనిపిస్తున్నాయి. ఆమె పోజులు కూడా అందుకు తగ్గట్లే ఉన్నాయి. ఈ సందర్భంగా షారుఖ్ మాట్లాడుతూ.. సుహానా ఎప్పుడైతే తన స్థాయిని చూసుకుని గర్వ పడుతుందో.. అప్పుడే తానూ ఆమెను చూసి గర్వ పడతానని.. ఇకపై ‘షారుఖ్ కూతురు’ తనను పిలవడం మానేస్తారని ఆశిస్తున్నానని చెప్పాడు. సుహానా చాలా కష్టపడుతోందని.. సొంతంగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందని.. ఆమె ఈ మ్యాగజైన్లో చాలా అందంగా కనిపిస్తోందని అన్నాడు. సుహానాను కథానాయికగా పరిచయం చేస్తాడని అంటున్న కరణ్ జోహార్ సైతం ఈ మ్యాగజైన్ విషయమై స్పందించాడు. సుహానాకు కితాబు ఇచ్చాడు.