Begin typing your search above and press return to search.

ఖాన్ డాట‌ర్ క‌వ్వింత తుళ్లింత‌

By:  Tupaki Desk   |   4 Sep 2019 12:10 PM GMT
ఖాన్ డాట‌ర్ క‌వ్వింత తుళ్లింత‌
X
బాలీవుడ్ లో న‌ట‌వార‌సుల వెల్లువ గురించి వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. 2019లో ప‌లువురు క‌థానాయిక‌లు బాలీవుడ్ కి ప‌రిచ‌యం అయ్యారు. త్వ‌ర‌లోనే కింగ్ ఖాన్ న‌ట‌వార‌సురాలు సుహానా డెబ్యూ నాయిక‌గా రంగ ప్ర‌వేశం చేయ‌నుంది. ఈ అమ్మ‌డు ఇంకా ఒక్క సినిమా అయినా చేయ‌క ముందే మూడు ల‌క్ష‌ల మంది ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ ని సంపాదించుకుంది. న‌ట‌న‌లో ప్ర‌వేశించ‌క ముందే ర‌క‌ర‌కాల ఫోటోల‌తో సామాజిక మాధ్య‌మాల్లో క‌వ్విస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతోంది.

గ‌త ఏడాది వోగ్ క‌వ‌ర్ షూట్ తో సుహానా పేరు మార్మోగిపోయింది. కింగ్ ఖాన్ షారూక్- గౌరీఖాన్ నుంచి త‌న‌కు అన్ని ర‌కాలుగా అనుమ‌తి ల‌భించింద‌ని ఫోటోషూట్ స్ప‌ష్టం చేసింది. సుహానా క‌థానాయిక‌గా కెరీర్ సాగిస్తుంద‌ని షారూక్ అధికారికంగానూ ప్ర‌క‌టించారు. ఆ క్ర‌మంలోనే డిగ్రీ ప‌ట్టా అందుకున్న యూనివ‌ర్శిటీలోనే న‌ట‌న‌కు సంబంధించిన డిప్లోమా పూర్తి చేసింది. ట్రైనింగ్ లో ఉన్న‌ప్పుడే స్నేహితుల‌తో క‌లిసి ల‌ఘు చిత్రాల్లో న‌టించింది. ఇక ఎలానూ బాలీవుడ్ ఆరంగేట్రానికి ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని ఇప్ప‌టికే సిగ్న‌ల్స్ కూడా ఇచ్చింది.

ప్ర‌స్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ కి ట‌చ్ లో ఉంటోంది. నిరంత‌రం ఏదో ఒక వేడెక్కించే ఫోటోని షేర్ చేయ‌డం ద్వారా గ్లామ‌ర్ ప్ర‌పంచంపై త‌న‌కు ఉన్న మ‌క్కువ‌ను బ‌హిర్గ‌తం చేస్తోంది. తాజాగా సుహానా షేర్ చేసిన ఇన్ స్టా ఫోటో యూత్ ని తెగ‌ క‌వ్విస్తోంది. సుహానా స్లీవ్ లెస్ డ్రెస్ బోల్డ్ గా అందాల్ని బ‌హిర్గ‌తం చేస్తోంది. ఒక చేతిలో స్క్రిప్టు ఫైల్.. ఇంకో చేతిలో కాఫీ ప్లాస్క్.. వైట్‌ హ్యాండ్ బ్యాగ్ ధ‌రించి సింపుల్ గా న‌వ్వేస్తోంది సుహానా. పార్క్ సైడ్ బెంచ్ పై ఇంత‌కీ ఏం చేస్తోందో? మొత్తానికి ఇలా బోల్డ్ అండ్ హాట్ ఫోటోషూట్ల‌తో సుహానా అదిరిపోయే ఫీల‌ర్స్ వ‌దులుతోంది. ఈ స్టార్ కిడ్ బాలీవుడ్ ఎంట్రీ ఇంకెంతో దూరంలో లేద‌ని చెప్ప‌క‌నే చెబుతోంది. షారూక్ స్నేహితుడు క‌ర‌ణ్ జోహార్ సుహానా డెబ్యూ సినిమాని తెర‌కెక్కించ‌నున్నారు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లోనే తొలి సినిమా స్క్రిప్ట్ రెడీ అవుతోంద‌ని తెలుస్తోంది.