Begin typing your search above and press return to search.

న్యూ ఇయర్ వేడుకల్లో షారుఖ్ కూతురు!

By:  Tupaki Desk   |   3 Jan 2017 4:13 PM GMT
న్యూ ఇయర్ వేడుకల్లో షారుఖ్ కూతురు!
X
పిట్ట కొంచెం కూత ఘ‌నం అంటే ఇదేనేమో. మొన్న‌టిదాకా చిన్న పిల్ల‌లాగే క‌నిపిస్తూ వ‌చ్చింది షారుఖ్ ఖాన్ కూతురు సుహానే ఖాన్ గ‌త ఏడాదిగా ఎలా ట్రాన్స్ ఫామ్ అయిందో అంద‌రూ చూస్తున్నారు. ఆ మ‌ధ్య త‌న చిట్టి త‌మ్ముడు అబ్ రామ్ తో క‌లిసి బీచ్ లో బికినీతో ఇచ్చిన పోజు పెద్ద సంచ‌ల‌న‌మే అయింది. తాజాగా న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో భాగంగా ఈ టీనేజ్ బ్యూటీ మ‌రోసారి రెచ్చిపోయింది.

చిట్టి పొట్టి దుస్తుల్లో క్లీవేజ్ షో చేస్తూ ఔరా అనిపించింది. ఈ పార్టీలో ఆమెతో పాటు బాలీవుడ్ కు చెందిన మ‌రింత‌మంది స్టార్ కిడ్స్ పాల్గొన్నారు. అంద‌రూ కూడా న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో ఓ రేంజిలో ఎంజాయ్ చేశార‌ని వాళ్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. బ్లాక్‌ డ్రెస్‌తో అటెండ్‌ అయిన సుహానా ఖాన్‌ పార్టీకే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

భవిష్యత్తులో బాలీవుడ్‌ తెరపై కనిపించే అవకాశమున్న స్టార్‌ కిడ్స్ చాలామంది పార్టీలో సంద‌డి చేశారు. వీళ్లంతా న్యూ ఇయర్ బాష్ ను ఎంజాయ్‌ చేయడమే కాకుండా ఆహార్‌ పాండే జన్మదిన వేడుకల్ని కూడా నిర్వహించారు. ఈ స్టార్ కిడ్స్ ఇలా పార్టీలు.. ప‌బ్బుల్లో సంద‌డి చేస్తూ ముందే సోష‌ల్ లైఫ్ కు అల‌వాటు ప‌డ‌టం ద్వారా సినీ రంగ ప్ర‌వేశానికి ముందు భ‌యం.. బెరుకు లేకుండా చూసుకుంటున్నారేమో అనిపిస్తుంది

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/