Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ డాటర్‌ ఎంట్రీకి ఇదే సాక్ష్యం

By:  Tupaki Desk   |   16 Jun 2019 6:19 AM GMT
సూపర్‌ స్టార్‌ డాటర్‌ ఎంట్రీకి ఇదే సాక్ష్యం
X
బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ సినిమాల్లో నటించబోతుంది అంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షారుఖ్‌ ఖాన్‌ కూడా ఆ విషయాన్ని నిర్ధారించాడు. తన కూతురు సుహానాకు నటన అంటే ఆసక్తి ఉంది. ఆమె ఆసక్తిని నేను కాదనలేను. అయితే ప్రస్తుతం ఆమె చదువుకుంటోంది. కనీసం డిగ్రీ అయిన తర్వాత సినిమాల్లోకి రావాలని చెప్పాను. త్వరలో చదువు పూర్తి చేసి నటనలో శిక్షణ తీసుకోనుందని షారుఖ్‌ చెప్పాడు.

ఎప్పుడెప్పుడు సుహానా ఖాన్‌ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే సుహానాకు సంబంధించిన ఒక మేకింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ వీడియో చూసి అంతా కూడా బాలీవుడ్‌ లో సుహానా హీరోయిన్‌ గా నటిస్తుందని.. ఆ మూవీ.. ఈ హీరో అంటూ రకరకాలుగా ప్రచారం చేశారు. సుహానా హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వబోతుంది అందుకు సాక్ష్యం ఈ వీడియో అంటూ కొందరు ఆ వీడియోను వైరల్‌ చేయడం జరిగింది. అయితే ఆ మేకింగ్‌ వీడియో సినిమాది కాదని.. షార్ట్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ వీడియో అని తాజాగా వెళ్లడయ్యింది.

ఆ వీడియోలో సుహానా కారులో కూర్చుని ఉండగా షూట్‌ చేస్తున్నట్లుగా ఉంది. అది బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో ఉన్నా కూడా అంతా కూడా సుహానా గ్లామర్‌ కు ఫిదా అవుతున్నారు. తప్పకుండా బాలీవుడ్‌ లో స్టార్‌ కమర్షియల్‌ హీరోయిన్‌ గా సుహానా పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్రెండ్‌ చేస్తున్న షార్ట్‌ ఫిల్మ్‌ లో నటించిన సుహానా త్వరలోనే బాలీవుడ్‌ మూవీలో నటిస్తుందని అంతా ఆశిస్తున్నారు.