Begin typing your search above and press return to search.

ప‌ఠాన్ కోసం కింగ్ ఖాన్ పారితోషికం?

By:  Tupaki Desk   |   25 March 2021 11:30 PM GMT
ప‌ఠాన్ కోసం కింగ్ ఖాన్ పారితోషికం?
X
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఒక్కో సినిమాకి అందుకునే పారితోషికం ఇండ‌స్ట్రీలో బిగ్ డిబేట్ కి తెర తీస్తుంటుంది. ద‌శాబ్ధాల పాటు అజేయంగా కెరీర్ ని సాగించిన షారూక్ ద‌శాబ్ధాల పాటు బాక్సాఫీస్ కింగ్ అని నిరూపించుకున్నారు. ఇటీవ‌ల వ‌రుస ప‌రాజ‌యాల‌తో రేసులో వెన‌క‌బ‌డినా అత‌డికి ఉన్న రేంజు ఏమాత్రం త‌గ్గ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మిదే. ప్ర‌స్తుతం య‌ష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ప‌ఠాన్ చిత్రంలో షారూక్ న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో బాద్ షా పూర్తి విభిన్న‌మైన గెట‌ప్ లో అసాధార‌ణ యాక్ష‌న్ స్టార్ గా క‌నిపించ‌నున్నారు.

ఇక‌పోతే ఈ సినిమా కోసం షారూక్ ఏకంగా 100కోట్ల పారితోషికం అందుకుంటున్నాడ‌ని తెలిసింది. ప‌ఠాన్ చిత్రం నుంచి షారూక్ ఫోటోలు కొన్ని లీకైనా ఎక్కువగా స‌మాచారం లీక‌వ్వ‌కుండా య‌ష్ రాజ్ సంస్థ జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిథిగా న‌టిస్తుండడం మ‌రో పెద్ద‌ అస్సెట్ కానుంది.

SRK ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఖాన్ పారితోషికం హాట్ టాపిక్ గా మారింది. జీరో (2018) తర్వాత చాలా గ్యాప్ రావ‌డం కూడా హైప్ కి కార‌ణంగా క‌నిపిస్తోంది. ఈ సినిమా 2020 న‌వంబ‌ర్ లో ప్రారంభ‌మైంది. 2022 లో విడుద‌ల కానుంది. ఇటీవల స్వరకర్తల‌ ద్వయం విశాల్-శేఖర్ ఈ చిత్రానికి పాటల్ని అందిస్తున్నామ‌ని ధృవీకరించారు.