Begin typing your search above and press return to search.

షారుఖ్ ఖాన్ అరెస్ట‌య్యాడు

By:  Tupaki Desk   |   29 Feb 2016 12:38 PM GMT
షారుఖ్ ఖాన్ అరెస్ట‌య్యాడు
X
అవును షారుఖ్ ఖాన్ అరెస్ట‌య్యాడు.. భారీ బందోబ‌స్తు మ‌ధ్య త‌న ఇంటి వ‌ద్ద షారుఖ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా షారుఖ్ ఇంటి ద‌గ్గ‌ర ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తాయి. ఈ సంద‌ర్భంగా షారుఖ్ భార్య చాలా ఎమోష‌న‌ల్ అయింది. అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండ‌గా పోలీసులు షారుఖ్ ను జీపు ఎక్కించారు.ఇంత‌కీ షారుఖ్ ఏం చేశాడ‌ని అత‌ణ్ని పోలీసులు అరెస్టు చేశారో తెలుసా.. అత‌ను స్మ‌గ్లింగ్ చేస్తున్నాడ‌నే. షారుఖ్ ఏంటి.. స్మ‌గ్లింగ్ చేయ‌డం ఏంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా.. ఐతే అస‌లు మేట‌ర్లోకి వెళ్దాం ప‌దండి.

ఈ అరెస్టు.. హంగామా అంతా సినిమా షూటింగ్ లో భాగంగా జ‌రిగిందేలెండి.షారుఖ్ ప్ర‌స్తుతం రాయీస్ అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాహుల్ డోలాకియా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో షారుఖ్ స్మ‌గ్ల‌ర్ పాత్ర పోషిస్తున్నాడు. పాకిస్థాన్ న‌టి మ‌హిర్ ఖాన్ అత‌డి భార్య పాత్ర పోషిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా ఇటీవ‌ల షారుఖ్ అరెస్టుకు సంబంధించిన స‌న్నివేశాలు తీశారు. సినిమాలో ఈ సీన్ చాలా కీల‌క‌మ‌ట‌. భారీ జ‌నం మ‌ధ్య ఈ స‌న్నివేశం తీశారు. ఆ దృశ్యాల్ని కొంద‌రు వీడియో- ఫొటోలు తీసి నెట్లో పెట్టారు. అవి నెట్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఏడాది రంజాన్ సంద‌ర్భంగా రాయీస్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అదే సమ‌యంలో స‌ల్మాన్ సుల్తాన్ సినిమా కూడా రిలీజ‌వ‌బోతుండ‌టం విశేషం.