Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్స్ ఇద్దరు ఒక్క రూపాయి తీసుకోలేదట!

By:  Tupaki Desk   |   22 Jun 2022 10:00 AM IST
సూపర్ స్టార్స్ ఇద్దరు ఒక్క రూపాయి తీసుకోలేదట!
X
తమిళ స్టార్‌ హీరో మాధవన్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం రాకెట్రీ. ఈ సినిమా గురించి గత కొన్నాళ్లు గా మీడియాలో వార్తలు వస్తున్నాయి. నంబి నారాయన్‌ అనే శాస్త్రవేత్త జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూలై 1వ తారీకున విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా కోసం మాధవన్ పడ్డ కష్టం గురించి తమిళ మీడియా చాలా చెబుతోంది.

మాధవన్ ప్రయత్నం ను ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. ఆయన స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం పలువురు స్టార్స్ మేము సైతం అన్నట్లుగా తమ వంతు సహాయం మరియు సహకారం ను అందించేందుకు ముందుకు వస్తున్నారు. దేశం మొత్తం నంబి నారాయణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఆయన గురించి జనాలకు చెప్పే సినిమా కోసం తమ వంతు సహకారం అన్నట్లుగా బాలీవుడ్ సూపర్ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ మరియు తమిళ సూపర్ స్టార్‌ హీరో సూర్య లు పారితోషికం తీసుకోకుండా నటించారట. ఈ సినిమా లో వీరిద్దరు కీలకమైన గెస్ట్‌ రోల్స్‌ లో కనిపించబోతున్నారట. రెండు పాత్రలు కూడా సినిమా లో కథకు అత్యంత కీలకంగా ఉంటాయట.

పాత్రల ప్రాముఖ్యత దృష్ట్యా సినిమా లో వారిద్దరిని నటింపజేసినట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మాధవన్ చేస్తున్న ఈ గొప్ప బయోపిక్‌ కు తమవంతు సహకారం అన్నట్లుగా వీరు ఏమాత్రం పారితోషికం తీసుకోకుండా నటించారట.

ఇద్దరు కూడా పారితోషికం తిరస్కరించినట్లు తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మాధవన్‌ వారిద్దరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిజేస్తున్నాడు.