Begin typing your search above and press return to search.

ఆ హీరోకు కొత్త తలనొప్పి వచ్చిందే

By:  Tupaki Desk   |   1 April 2017 3:36 PM IST
ఆ హీరోకు కొత్త తలనొప్పి వచ్చిందే
X
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అసలు బ్యాచిలర్ గానే ఉండిపోతాడేమో అనుకుంటున్న తరుణంలో.. మనోడు చివరకు పెళ్ళి చేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన మీరా రాజ్పుత్ అనే కాలేజీ స్టూడెంట్ ను పెళ్ళాడేశాడు. ఇద్దరి మధ్యనా 10 ఏళ్ళ గ్యాప్ ఉంది. ఈ మధ్యనే వీరికి ఒక అమ్మాయి కూడా పుట్టింది. అయితే ఇప్పుడు షాహిద్ కు అసలు ట్రబుల్స్ మొదలయ్యాయ్.

తన మాజీలకు చూపించుకోవడానికో లేదంటే ఇంకేదైనా సందేశం ఇవ్వడానికో తెలియదు కాని.. ఆ మధ్యన బాలీవుడ్ లోని చాలా ఈవెంట్లకు భార్యను వెంటపెట్టుకునే తిరిగేశాడు షాహిద్. అంతేకాదు.. కొన్ని ర్యాంప్ షోలలో తన భార్యతో కూడా క్యాట్ వాక్ చేయించేశాడు. అప్పటినుండీ ఒకవేళ మీరా ఏమైనా హీరోయిన్ గా రంగంలోకి దిగుతోందా అంటూ రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే ఏకంగా చాలామంది నిర్మాతలే మీ ఆవిడను హీరోయిన్ గా దించేద్దాం అంటూ ఒత్తిడి చేస్తున్నారట.

మొత్తానికి షాహిద్ కు ఇది కొత్త తలనొప్పిగానే మారిందని చెప్పాలి. అయితే ఇప్పటికే తనకు యాక్టింగ్ పై పెద్దగా ఆసక్తి లేదని మీరా చాలాసార్లు చెప్పేసింది కాబట్టి.. ఆమెను హీరోయిన్ గా తెరపై చూడటం కాస్త కష్టమే. అయినా అక్కడ నానా అవస్థలు పడుతున్న గ్లామర్ భామలు చాలామంది ఉంటే.. వారికి ఛాన్సులు ఇవ్వకుండా మనోళ్లు ఇలా కొత్తమ్మాయిల కోసం ఎందుకు పడుతున్నారో ఏంటో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/