Begin typing your search above and press return to search.

హీరో వైఫ్‌ జరిమానా కట్టేసిందంతే

By:  Tupaki Desk   |   9 May 2017 10:21 AM IST
హీరో వైఫ్‌ జరిమానా కట్టేసిందంతే
X
సెలెబ్రటీలు రోడ్ పైకి వస్తే భలే న్యూస్ వస్తుంది. వాళ్ళు షాపింగ్ కి వెళ్ళినా , పార్టీకి వెళ్ళినా ఏదో ఒక దగ్గర తప్పుకు దొరుకుతారు కదా అని ఎదురు చూసే వాళ్ళు లేకపోలేదు. కానీ వాళ్ళు ఏమి కావాలని చేయరు మనాలాగే చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. కాకపోతే మనం చేశాం అని ఎవ్వరికీ తెలియదు మనం చెప్పే వరుకు.. వాళ్ళు చేస్తే వాళ్ళు ఇంటికి వెళ్లకముందే ప్రపంచానికి తెలుస్తుంది.

ఇప్పుడు ఇదే విధంగా షాహిద్‌ కపూర్‌ భార్య మీరా రాజ్‌పుత్‌ ట్రాఫిక్ నియమాలను ఫాలో కాకపోవడం వలన జరిమానా కట్టవలిసి వచ్చింది. ఆదివారం మీరా వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న కిచెన్‌ గార్డెన్‌ రెస్టారెంట్‌కి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఆమె షాపింగ్ చేసుకొని బయటికి రాగానే బయట పోలీసులు ఉన్నారు ఆమె కారు దగ్గర. నో పార్కింగ్‌ జోన్‌లో పెట్టి వెళ్ళిపోయారని చెబుతూ.. 2 వేలు జరిమానా కట్టమన్నారు. అయితే మీరా పోలీసులతో ఎలాంటి గొడవ పెట్టుకోకుండా మర్యాదపూర్వకంగా డబ్బులు కట్టి వెళ్లిపోయింది.

ఇలాంటి సందర్భాల్లో కొందరు వాదనకు దిగుతారుని జరిమానా కట్టకుండా పోలీసులతో గొడవపడుతుంటారని అని వారు చెప్పారు. మీరా పద్దతిగా కట్టి వెళ్ళిపోయారు అని మెచ్చుకున్నారు కూడాను. సర్లేండి సెలబ్రిటీలందరూ ఒకవేలా ఉంటారా ఏంటి.