Begin typing your search above and press return to search.

వైరల్ పిక్: బెస్ట్ కపుల్ ఇన్ బీ-టౌన్

By:  Tupaki Desk   |   7 Feb 2019 11:12 AM GMT
వైరల్ పిక్: బెస్ట్ కపుల్ ఇన్ బీ-టౌన్
X
'అర్జున్ రెడ్డి' సినిమా రీమేక్ అనగానే అందరి దృష్టి సహజంగానే ఆ సినిమాపైనే ఉంటుంది. తమిళ రీమేక్ 'వర్మ' తో పాటు హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' కు సంబంధించిన అప్డేట్స్ క్లోజ్ గా ఫాలో అవుతున్నారు సినీ ప్రేమికులు. తమిళ వెర్షన్ కు సంబంధించిన ప్రోమోస్ ఇప్పటివరకూ పెద్దగా మెప్పించలేకపోయాయిగానీ హిందీ రీమేక్ పరిస్థితి మెరుగ్గా ఉంది. ఒరిజినల్ డైరెక్టర్ సందీప్ వంగానే రీమేక్ కు దర్శకుడు కావడం దీనికి ఒక కారణం అయితే.. మంచి యాక్టర్ గా పేరున్న షాహిద్ కపూర్ విజయ్ దేవరకొండ పాత్రను పోషించడం మరో కారణం.

షూటింగ్ లోకేషన్ నుంచి బైటకు వచ్చిన స్టిల్స్.. షాహిద్ డిఫరెంట్ గెటప్స్ ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించాయి. 'లస్ట్ స్టోరీస్' బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్ కావడంతో ఘాటు కిస్సుల సునామీ ఖాయమని ఆడియన్స్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ మాత్రమేకాకుండా షాహిద్ కపూర్ ఫోటో వేరేది ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోను షాహిద్ కపూరే తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయడం విశేషం. ఈ సెల్ఫీలో షాహిద్ కపూర్ తన ముద్దుల భార్య మీరా రాజ్ పుత్ ను వెనకనుంచి బ్యూటిఫుల్ గా హగ్ చేసుకున్నాడు. తన ఎడమ చేతితో ప్రేమగా మీరాను బంధిస్తే.. ఆమె సెల్ఫీ తీసింది.

మీరా రాజ్ పుత్ ఈ ఫోటోలో మేకప్ లేకుండా క్యాజువల్ గా ఉండగా.. షాహిద్ కూలింగ్ క్లాసెస్ పెట్టుకొని సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు. ఈ ఫోటోకు వన్ మిలియన్ లైక్స్ వచ్చాయి. సూపర్ కపుల్ అంటూ.. క్యూట్ కపుల్ అంటూ బెస్ట్ కపుల్ ఇన్ బీ-టౌన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజనులు.