Begin typing your search above and press return to search.

పౌరాణిక చిత్రంలో షాహిద్ కపూర్?

By:  Tupaki Desk   |   17 Jan 2021 10:56 AM IST
పౌరాణిక చిత్రంలో షాహిద్ కపూర్?
X
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్ లేటెస్ట్ మూవీ జెర్సీ. తెలుగులో నాని హీరోగా వచ్చిన ఈ మూవీని.. బాలీవుడ్లో షాహిద్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ను ఇటీవలే ఫినిష్ చేశారు. సమ్మర్ సీజన్లో ప్రేక్షకుల ముందుకు తేవాలని యూనిట్ ట్రై చేస్తోంది.

ఇప్పుడు.. అమెజాన్ ప్రైమ్‌తో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం షాహిద్ ఓ వెబ్ సిరీస్ లో నటించనున్న విషయం తెలిసిందే. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ రూపొంచిందించిన బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డికె.. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఈ వెబ్ సిరీస్ పేరు ‘గవర్’గా నిర్ణయించినట్టు టాక్. మొత్తం రెండు సిరీస్ లలో ఫినిష్ కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, మాలవికా మోహనన్ ప్రధాన పాత్రలు పోషించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ షూట్ మొదలు పెట్టి, నిరంతరాయంగా కొనసాగించి, ఏప్రిల్ లోపు ముగిస్తారని సమాచారం. ఈ ‘గవర్’‌ను ముంబై, గోవాలోనే మొత్తం చిత్రీకరించనున్నట్టు టాక్.

ఇదిలావుండగా.. బాలీవుడ్ దర్శకుడు ఓంప్రకాష్ మెహ్రా డైరెక్షన్ లో షాహిద్ కపూర్ ఒక చిత్రం చేయబోతున్నట్టు సమాచారం. ఈ మూవీ మహాభారతం ఆధారంగా తెరకెక్కే పౌరాణిక చిత్రమని తెలుస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ సర్కిల్స్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.