Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: షాహిద్ ని ఓదార్చాల్సిందే పాపం!

By:  Tupaki Desk   |   13 Aug 2021 4:30 AM GMT
ఫోటో స్టోరి: షాహిద్ ని ఓదార్చాల్సిందే పాపం!
X
కొన్ని క్లిక్స్ యూనిక్.. చాలా అరుదుగానే అలాంటి స్నాప్స్ సాధ్యం. ఇక్క‌డ చూస్తున్న ఈ ఫోటో అలాంటిదే. చూడ‌గానే ఫ‌క్కున న‌వ్వ‌కుండా ఆగ‌లేరు. అంత‌టి అంద‌గాడు స్టార్ హీరో ప‌క్క‌నే ఉండ‌గా ఎవ‌రికో హ‌గ్గిస్తున్న రాశీ ఖ‌న్నా వ్య‌వ‌హారం ఏమిటో కానీ... పాపం షాహిద్ కి నోట మాట రాలేదు. అత‌డిని ఓదార్చాల్సిందే! ఓదార్చినా కానీ.. అలాంటి సీన్ లో అవాక్క‌యి చూడ‌టం త‌ప్ప ఇంకేం చేయ‌గ‌ల‌డు పాపం?

రాజ్ అండ్ డికె తదుపరి తెర‌కెక్కిస్తున్న వెబ్ సిరీస్ సెట్స్ లో రాశి ఖన్నా ఇలా షాహిద్ కపూర్ ను ఏడిపించింది. దానికి రాజ్ అండ్ డీకే అత‌డిని ఓదార్చారు. డీకేని రాశీ ఖ‌న్నా అలా హ‌గ్ చేసుకుంది మ‌రి. షాహిద్ కపూర్ రాశి ఖన్నాతో కలిసి రాజ్ & DK త‌దుప‌రి వెబ్ సిరీస్ లో ఆస‌క్తిక‌ర పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ వివరాలను ఇంకా ద‌ర్శ‌క‌ద్వ‌యం వెల్ల‌డించ‌లేదు. రాశీ ఆన్ లొకేష‌న్ ఫ‌న్ ఎలిమెంట్ ని ఇలా షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది.

ఈ సిరీస్ లో సౌత్ స్టార్ హీరో విజయ్ సేతుపతి న‌టిస్తున్నాడు. ద‌ర్శ‌క‌నిర్మాత కృష్ణ డికెను కౌగిలించుకుని రాశీ అలా కెమెరాకు ఫోజులిచ్చింది. ఆమె వైఖ‌రికి షాహిద్ కాస్త బాధాకరమైన హావ‌భావాన్ని వ్య‌క్తం చేసాడు. ``ఇది సరే @షాహిద్ క‌పూర్.. వారు నిన్ను కూడా ప్రేమిస్తారు!`` అంటూ రాజ్ అండ్ డీకే ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ని ఇచ్చారు.

ఇటీవ‌లే అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ తో డిజిటల్ అరంగేట్రం చేయనున్న షాహిద్ ఇన్ స్టాగ్రామ్ లో సేతుపతి- రాశి ఖన్నాలను ట్యాగ్ చేస్తూ ఒక చిన్న వీడియోను పోస్ట్ చేశాడు. సెట్ లో వెయిటింగ్ చేస్తున్నాను.. త్వరగా నాకు కాల్ చేయండి అని రాశారు.

ఫ‌న్ ఎలిమెంట్స్ తో తెర‌కెక్కుతున్న థ్రిల్ల‌ర్ డ్రామా సిరీస్ ఇది. రాజ్ అండ్ డికె దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీతా ఆర్ మీనన్- సుమన్ కుమార్ - హుస్సేన్ దలాల్ త‌దిత‌రులు దీనికి ర‌చ‌యిత‌లు. కెరీర్ ప‌రంగా చూస్తే షాహిద్ తదుపరి జెర్సీలో కనిపించనున్నాడు.