Begin typing your search above and press return to search.

రాణితో షాహిద్ స్పెషల్ పోజులు

By:  Tupaki Desk   |   2 Nov 2017 1:30 AM GMT
రాణితో షాహిద్ స్పెషల్ పోజులు
X
షాహిద్ కపూర్.. రాణి అనగానే.. ఇప్పుడు పద్మావతి సినిమా గుర్తుకు రావడంలో ఆశ్చర్యం లేదు. అందులో రాణి పద్మినిగా దీపికా పదుకొనే.. ఆమె భర్త రోల్ లో షాహిద్ నటిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు చెప్పబోతున్న రాణి.. షాహిద్ కి రియల్ లైఫ్ క్వీన్. షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ ఎంతో గ్లామరస్ గా ఉంటుంది. ఆమెను హీరోయిన్ గా చేసేందుకు కూడా ఆఫర్స్ వచ్చాయంటారు.

అయితే.. రాయల్ ఫ్యామిలీకి చెందిన ఈ జంట.. ఇప్పుడు రీసెంట్ గా హెలో మేగజైన్ కవర్ పేజ్ కోసం కలిసి పోజులు ఇచ్చారు. ఏ మాటకు ఆమాటే చెప్పుకోవాలంటే.. రాజసం అలా ఉట్టిపడుతోందంతే. అటు రాయల్ లుక్స్ లో కానీ.. ఇటు తమ మధ్య అనుబంధాన్ని చాటి చెప్పడంలో కానీ ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు ఈ జంట. మొత్తం మీద ఫోటో సెషన్ లో కొంచెం హాట్ నెస్ పంచుతూనే.. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పారు షాహిద్ కపూర్.. మీరా రాజ్ పుత్. ఈ ఫోటోలనే షేర్ చేస్తూ.. 'నా హృదయాన్ని పాలించే రాణి' అంటూ క్యాప్షన్ తగిలించాడు షాహిద్ కపూర్.

ఈ లుక్ చూసిన తర్వాత షాహిద్ చెప్పిన మాటల్లో ఏ మాత్రం అసత్యం కానీ.. అసందర్భం కానీ లేదని చెప్పవచ్చు. ఇక పద్మావతి చిత్రంలోనూ రావల్ రతన్ సింగ్ పాత్రలో తెగ మెరిసిపోతున్నాడు షాహిద్ కపూర్. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది.