Begin typing your search above and press return to search.

ప్రియాంకను చంపేస్తానంటున్నాడుగా!

By:  Tupaki Desk   |   2 Jan 2017 1:30 PM GMT
ప్రియాంకను చంపేస్తానంటున్నాడుగా!
X
కరణ్ జోహార్ సెలబ్రెటీ టాక్ షో... "కాఫీ విత్ కరణ" హాట్ హాట్ గా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గత ఎపిసోడ్ లో కత్రినా హడావిడి చేసి ప్రేమ ఫెయిల్ అవ్వడంపై తనదైన స్టైల్లో స్పందించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా ఈ షో లో పాల్గొన్న షాహిద్ కపూర్ - మీరా రాజ్ పుత్ దంపతులు తమదైన శైలిలో సమాధానాలు చెప్పారు. ఈ షోలో పాల్గొన్న ప్రతీ సెలబ్రెటీ వీలైనంతవరకూ బోల్డ్ గా తమ తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఈ జంట కూడా ఏమాత్రం తగ్గకుండా.. కరణ్ అడిగిన ప్రశ్నలకు చాలా ఓపెన్ గా సమాధానాలు ఇచ్చింది.

ఈ షోలో భాగంగా కిల్‌-మ్యారీ-హుకప్‌ గేమ్‌ లో భాగంగా కరణ్ కు ఒక ప్రశ్న సంధించాడు కరణ్. అదేమిటంటే... "సోనాక్షి సిన్హా - అలియా భట్‌ - ప్రియాంకచోప్రా లలో ఎవరినీ చంపేస్తావు - ఎవరితో ఎఫైర్‌ పెట్టుకుంటావు, ఎవరిని పెళ్లిచేసుకుంటావు"! ఈ ప్రశ్నలకు ఏమాత్రం సెకండ్ థాట్ లేకుండా స్పందించిన షాహిద్... ప్రియాంకను చంపేస్తానని బదులిచ్చాడు. ఇక పెళ్లి విషయానికొస్తే... సోనాక్షిని పెళ్లి చేసుకుంటానని - పెళ్లికి ఆమె చాలా అనువుగా ఉంటుందని చెప్పాడు. ఫైనల్ గా రిలేషన్‌ షిప్‌ పెట్టుకోవడంలో ఆలియాను సెలక్ట్ చేసుకున్న షాహిద్... ఆమెతో రిలేషన్ పెట్టుకోవడం చాలా క్షేమం కాబట్టి ఆమెతో హుకప్‌ అవుతానని చెప్పాడు.

ఇక తర్వాత వంతు మీరా రాజ్ పుత్ ది. ఈ మెకు కూడా నాలుగు ప్రశ్నలు సంధించాడు కరణ్. అవేమిటంటే... "నమ్మక ద్రోహం - అత్తింటివారి జోక్యం - బ్యాడ్‌ సెక్స్‌ - బోర్‌ డమ్‌.. ఈ నాలుగింటిలో మీ వివాహబంధం విచ్ఛిన్నానికి దారితీయడానికి అవకాశమున్న అంశాలు ఏమిటి?" ఈ ప్రశ్నలపై స్పందించిన మీరా... "మా అత్తింటివారు మంచి వారు కాబట్టి ఆ విషయంలో నో ప్రాబ్లం - ఇక బోర్‌ అన్న ప్రసక్తే లేదు, చెడు శృంగారం జోలికి మేం వెళ్లబోం, కాబట్టి ఫైనల్ గా ఛీటింగ్‌ కావొచ్చు" అంటూ సమాధానమిచ్చింది. వీరిచ్చిన సమాధానాలతో షో అంతా సందడి సందడిగా మారింది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/